కొత్త ఐఫోన్ 8 ఇదిగో, ఇలా ఉంటుందట..

Written By:

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కి ఉన్న క్రేజే వేరు. అందులోనూ ఐఫోన్ మార్కెట్ లోకి రానుందంటే ఇతర ఫోన్ సంస్థలన్నీ ఏ ఫీచర్లలో ఐఫోన్ మార్కెట్ ను కొల్లగొడుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తాయి.అయితే ఇప్పుడు ఆపిల్‌ కొత్తగా విడుదల చేయనున్న ఐఫోన్‌ తదుపరి మోడల్‌ వివరాలు తొలిసారిగా బయటికొచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఆపిల్ ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.

వాట్సప్‌లో మరో పవర్‌పుల్ ఫీచర్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్‌ ఎక్స్‌గా నామకరణం

కంపెనీ ఐఫోన్‌ మోడల్‌ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 5.8 అంగుళాల కలిగిన ఓఎల్‌ఈడీ తెరతో ఐఫోన్ 8ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ కొత్త ఫోన్‌కు ఐఫోన్‌ ఎక్స్‌గా నామకరణం చేసినట్లు సమాచారం.

కొత్త ఐఫోన్‌ ఖరీదు 1000 డాలర్లు

అమెరికా ధరల ప్రకారం ఈ కొత్త ఐఫోన్‌ ఖరీదు 1000 డాలర్లు ఉండొచ్చని అంచనా. ఆపిల్‌ విడుదల చేయనున్న అత్యంత ఖరీదైన ఐఫోన్‌ ఇదే కావడం విశేషం.

ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ మోడళ్లకు

వీటితో పాటు ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ మోడళ్లకు సరికొత్త హంగులను జోడించి ఐఫోన్‌ 7ఎస్‌, ఐఫోన్‌ 7ఎస్‌ ప్లస్‌ పేర్లతో ఆపిల్‌ విడుదల చేయనుంది.

ఐఫోన్‌ 7 ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్‌ 8

నిక్కీ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఐఫోన్‌ 7 ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్‌ 8 చిన్నగా ఉంటుందని, ఐఫోన్‌ 8 వేలిముద్ర సెన్సార్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయాలతో రానుండటం దీని ప్రత్యేకతని తెలిపింది.

కొత్త కనెక్టర్‌ వంటి యాక్సెసరీస్‌

ఐఫోన్‌ కోసం కొత్త కనెక్టర్‌ వంటి యాక్సెసరీస్‌లను సైతం విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 8 పిన్‌లు కలిగిన అల్ట్రా యాక్సెసరీ కనెక్టర్‌ (యూఏసీ)ను కూలా రీలీజ్ చేయనుంది. యూఎస్‌బీ-సీ కంటే కొంత తక్కువ మందంగా ఉండేలా దీన్ని తయారు చేయొచ్చని సమాచారం.

5.15 అంగుళాలు మాత్రమే

5.8 అంగుళాల తెరలో 5.15 అంగుళాలు మాత్రమే వినియోగించుకోవచ్చని ఫిబ్రవరిలో ఓ సంస్థ నివేదిక తెలిపిని విషయం విదితమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New report reaffirms the most exciting new iPhone 8 feature Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot