వాట్సప్‌లో మరో పవర్‌పుల్ ఫీచర్ !

Written By:

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తూనే ఉంది. యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ మధ్యనే స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. అయితే ఇప్పుడు మరో పవర్ పుల్ ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

టాయిలెట్ క్రిముల కంటే దారుణమైన క్రిములు మీ ఫోన్లో ఉన్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఓ నూతన ఫీచర్

వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఓ నూతన ఫీచర్ అతి త్వరలో వాట్సప్ యూజర్లకు లభ్యం కానుంది. దీని వల్ల యూజర్లు ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు.

వైఫై వాడుతున్న వారికి

వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీగా ఈ ఫీచర్‌ను అందించేందుకు వాట్సప్ యత్నిస్తోంది. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ దశలో ఉంది. అతి త్వరలోనే యూజర్ల ముందుకు రావచ్చని అంచనా

ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌

దీంతోపాటు ఎవరైనా ఒక యూజర్‌కు వచ్చే ఫొటోలు, వీడియోల సైజ్‌ను తెలిపేందుకు ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల పెద్ద సైజ్ కలిగిన ఫొటోలు, వీడియోలను యూజర్లు అవసరం లేదనుకుంటే వెంటనే ఫోన్‌లోంచి డిలీట్ చేసేందుకు వీలు కలుగుతుంది.

ఐకాన్లు, ఎమోజీలు, సింబల్స్

వాట్సప్‌లో ఐకాన్లు, ఎమోజీలు, సింబల్స్ ఎన్ని ఉన్నాయో తెలిపేందుకు కూడా ప్రత్యేక ఆప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ మాత్రమే కాకుండా త్వరలో మరిన్ని ఫీచర్లను వాట్సప్ అందించనున్నట్టు తెలిసింది.

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు గమనించారా...

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు గమనించారా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All-new WhatsApp updates coming soon, may include video-conferencing too! read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot