పాత రోజులను గుర్తుచేస్తున్న నోకియా 110 ఫీచర్ ఫోన్

|

HMD గ్లోబల్ యాజమాన్యంలోని ఫిన్నిష్ అప్‌స్టార్ట్ సంస్థ నోకియా భారత మార్కెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి కేవలం స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే దృష్టి సారించాయి. కానీ హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఇండియా మార్కెట్ వైపు కొద్దిగా భిన్నంగా ఆలోచించింది. ఈ సంస్థ భారతీయ వినియోగదారుల కోసం ఫీచర్ ఫోన్‌లను కూడా రవాణా చేస్తుంది.

నోకియా

నోకియా 8110 మరియు బనానా ఫోన్ వంటి కొన్ని ఐకానిక్ ఫీచర్ ఫోన్‌లను తయారు చేసినందుకు నోకియాకు గతంలో మంచి ఘనత లభించింది. HMD సంస్థ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేస్తూనే ఉండటంతో ఈ ఫీచర్ ఫోన్‌ల వారసత్వం కొనసాగుతుంది. ఇటీవల నోకియా 6.2 మరియు నోకియా 7.2 లను విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ వన్‌తో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు.

HMD గ్లోబల్

HMD గ్లోబల్ సంస్థ నోకియా 110 అనే కొత్త ఫీచర్ ఫోన్‌ను ఇండియాలో 1,599 రూపాయలకు విడుదల చేసింది. 2G సపోర్ట్ గల ఈ ఫోన్‌ను IFA 2019 సమయంలో నోకియా 2720 ఫ్లిప్, నోకియా 7.2, నోకియా 6.2 మరియు నోకియా 800 టఫ్ లతో పాటుగా ప్రవేశపెట్టారు. ఇది నోకియా 105 కు అప్‌గ్రేడ్ వెర్షన్ గా వస్తున్నది. ఇది ముఖ్యంగా MP3 ప్లేయర్, FM రేడియో, క్లాసిక్ స్నేక్ గేమ్ మరియు 18.5 రోజుల స్టాండ్‌బై టైమ్‌ సామర్ధ్యంతో గల బ్యాటరీతో వస్తుంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

నోకియా 110 ఫోన్ ఓషన్ బ్లూ, బ్లాక్ మరియు పింక్ కలర్ లలో లభిస్తుంది. ఇది అక్టోబర్ 18 నుండి భారతదేశంలోని మొబైల్ రిటైల్ అవుట్లెట్లలో లభిస్తుంది. కంపెనీ తన అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లలో దీనిని 1,599 రూపాయల ధర వద్ద విక్రయిస్తోంది.


HMD గ్లోబల్ సంస్థ కొత్తగా అందిస్తున్న నోకియా 110 వినోదం విషయంలో ఒక మెట్టును అందిగమించింది. నోకియా 110 ఫోన్ అభిమానులకు సంగీతం, గేమ్స్ విషయంలో మీరు ఆశించే వాటి కంటే ఎక్కువగా ఉంటాయి. దాని దీర్ఘకాలిక బ్యాటరీతో నోకియా 110 మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు సిద్ధంగా ఉంటుంది.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్..... ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

నోకియా 110 ఫీచర్ ఫోన్ నోకియా 105కు అప్‌గ్రేడ్ వెర్షన్ గా వచ్చింది. ఈ ఫోన్ 1.77-అంగుళాల QVGA కలర్ డిస్‌ప్లేతో ప్యాక్ చేయబడి వస్తుంది. HMD గ్లోబల్ ఫీచర్ ఫోన్‌ను "మీ జేబులో వినోదం" అని పిలుస్తోంది. ఈ ఫోన్ VGA కెమెరా, మ్యూజిక్ ప్లేయర్‌తో వస్తుంది. గేమ్స్ విషయానికి వస్తే ఇది స్నేక్స్, డూడుల్ జంప్, నింజా అప్, ఎయిర్‌స్ట్రైక్ మరియు పెనాల్టీ కప్ వంటి గేమ్ లను కలిగి ఉంది.

 

రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీ సేల్స్రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీ సేల్స్

 FM రేడియో

ఇది FM రేడియోను కలిగి ఉండి మైక్రో ఎస్డి కార్డు స్లాట్ మద్దతుతో 32 జిబి మెమరీ వరకు ప్రయోజనం ఇస్తుంది. ఫోన్‌కు అతిపెద్ద USP బ్యాటరీ 18.5 రోజుల స్టాండ్‌బై సమయంతో వస్తుంది. నోకియా ఈ పరికరంలో 800 ఎంఏహెచ్ తొలగించగల బ్యాటరీని సరఫరా చేసింది. ఇది 2Gకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది మరియు డ్యూయల్ సిమ్‌కు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Nokia 110 Launched in India: Price,Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X