నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... బడ్జెక్ట్ ధరలో...హైలైట్స్

|

HMD గ్లోబల్ సంస్థ ఇప్పుడు తన సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 2.3 ని విడుదల చేసింది. రాత్రి కైరోలో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ నోకియా 2.3 ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నోకియా 7.2 తో కనిపించే డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. నిన్న జరిగిన కార్యక్రమంలో అందరు ఊహించినట్లుగా నోకియా 2.3 తో పాటుగా నోకియా 8.2 మరియు నోకియా 5.2 ను కంపెనీ విడుదల చేయలేదు.

దరల వివరాలు

దరల వివరాలు

నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర 109 యూరోలు అంటే సుమారు రూ.8,700. ఇది డిసెంబర్ యొక్క మూడవ వారం నుండి వినియోగదారులు కొనుగోలు చేయడానికి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సియాన్ గ్రీన్, సాండ్ మరియు చార్ కోల్ అనే మూడు కలర్ ఎంపికలలో లబిస్తుంది. నోకియా 2.3ను ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు. ఇండియాలో దీనిని రూ.7,000 ధర వద్ద త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి.

 

BSNL నుంచి మూడు STV ప్లాన్‌లు అవుట్BSNL నుంచి మూడు STV ప్లాన్‌లు అవుట్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా నోకియా 2.3 ఒక 3D నానో-టెక్ట్ టర్డ్ కోటింగ్ మరియు అల్యూమినియం బాడీను కలిగి ఉంది. నోకియా 2.3 లో 6.1-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ‘సెల్ఫీ నాచ్' ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ హెలియో A22 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తూ ఉండి 2 జిబి ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది 400GB వరకు మెమొరీ విస్తరణ కోసం ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది.

 

రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండిరిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

కెమెరా

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ యొక్క డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ముందు వైపు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. నోకియా 2.3 కెమెరా యొక్క ముఖ్యాంశాలలో ఒకటి విభిన్న bokeh ప్రభావాలతో పోర్ట్రెయిట్ మోడ్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

 

5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా

ఫీచర్స్

నోకియా 2.3 లోని మరిన్ని ఫీచర్లలో డ్యూయల్ సిమ్ సపోర్ట్, బ్లూటూత్ 5.0, 4G LTE, ఎఫ్‌ఎం రేడియో మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇటీవలి నోకియా ఫోన్‌ల మాదిరిగానే ఇది కూడా గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 యొక్క ‘అడాప్టివ్ బ్యాటరీ' ఫీచర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒక్క ఛార్జ్ మీద 2 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌లో పని చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 10కు అప్డేట్ పొందడానికి సిద్ధంగా ఉందని కంపెనీ ధృవీకరించింది.

Best Mobiles in India

English summary
Nokia 2.3 Smartphone Launched: Price,Specifications and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X