ఈ రోజే సేల్, పాత రికార్డులు చెరిపేస్తుందా ? కొనాలా, వద్దా ఓ 5 కారణాలు !

Written By:

నోకియా 3310...ఈ పేరు ఒకప్పుడు సంచలనం. ప్రతి ఒక్కరూ దీని వెంటే అప్పుడు పరుగులు పెట్టారు. అయితే స్మార్ట్ ఫోన్ల రాకతో నోకియా 3310 తెర వెనక్కి వెళ్లిపోయింది. చాలాకాలం తరువాత మళ్లీ పురుడు పోసుకుంది. మరి దీని కోసం ఇప్పటికే చాలామంది నోకియా అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి రూ. 2210 ధరతో విక్రయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మకాలు ఎలా ఉండబోతున్నాయి. మరి కొనాలా వద్దా అనే దానిపై మీకు ఓ అయిదు కారణాలు ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

వన్ ఇయర్ ఇంటర్నెట్ ఉచితం, ఆ ఫోన్ సేల్ ఈ రోజే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ కింద పడితే అంతే..

కొనేందుకు అయిదు కారణాలు

ఇప్పట్లో వస్తున్న ఏ ఫోన్ అయినా కింద పడిందంటే దానిమీద ఆశలు వదులుకోవాల్సిందే. గొరిల్లా గ్లాస్, డ్రాగన్ టెయిల్ గ్లాస్ అనే టెక్నాలజీలు ఉన్నప్పటికీ,వాటికి బ్యాక్ కేస్‌లు, స్క్రీన్ గార్డులు వేసినప్పటికీ అవి నిలవడం లేదు. వేలకు వేలు పోసి కొన్న ఫోన్ పగిలితే ఆ బాధ చెప్పలేనిది.

నోకియా 3310 రఫ్ అండ్ టఫ్

అయితే నోకియా 3310 కు ఆ భయం లేదు. ఎందుకంటే ఒకప్పటి మోడల్ తరహాలోనే దీన్ని నాణ్యమైన క్వాలిటీతో తయారు చేశారు. కనుక ఎన్ని సార్లు కింద పడినా భేషుగ్గా దీన్ని వాడుకోవచ్చు. మంచి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో కొత్త నోకియా 3310ను తయారు చేశారు. రఫ్ అండ్ టఫ్ వాడే వారికి ఇది బెస్ట్ చాయిస్.

పెద్దలకు..

పెద్ద వారికి ఈ ఫోన్ కరెక్ట్‌గా సూటవుతుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లను వాడలేమనుకునే పెద్దలకు, వాటిని వాడడం తెలియని వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్.

పిల్లలకు

ఇక తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు కాకుండా ఫీచర్ ఫోన్ కొనివ్వాలంటే ఇదే కరెక్ట్ ఆప్షన్. వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు ఈ ఫోన్ చాలు.

బ్యాటరీ

నోకియా ఫోన్లు అంటేనే బ్యాటరీ పవర్‌కు, కాల్స్ క్వాలిటీకి పెట్టింది పేరు. కనుక ఎక్కువగా కాల్స్ మాట్లాడేవారికి స్మార్ట్‌ఫోన్ల కన్నా ఇదే మంచి బెస్ట్ చాయిస్ ఫోన్ అవుతుంది.

వాయిస్ క్లియర్‌

ఎన్ని కాల్స్ మాట్లాడినా బ్యాటరీ బాగా వస్తుంది. దీనికి తోడు వాయిస్ కూడా క్లియర్‌గా ఉంటుంది. మగవారు అయితే పై జేబులో పెట్టుకుని కాల్ వచ్చిన వెంటనే మాట్లాడవచ్చు.

బేసిక్ ఫోన్ కావాలనుకున్నవారికి

స్మార్ట్‌ఫోన్లు వాడలేం, బేసిక్ ఫోన్ పనులు ఉంటే చాలు. అని అనుకునే వారు కూడా ఈ ఫోన్‌ను నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. వారికీ ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఇంటర్నెట్లో టైం వేస్ట్ చేసుకుంటున్న వారికి

మొబైల్ ఇంటర్నెట్లో టైం వేస్ట్ చేసుకుంటున్న వారికి ఇది ఓ మంచి ఆప్సన్. గంటల తరబడి మొబైల్ ఇంటర్నెట్ ముందు గడిపేవారు ఈ ఫోన్ వాడటం వల్ల దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది.

స్నేక్ గేమ్

పాత నోకియా 3310లో యూజర్లందరినీ ఆకట్టుకుంది స్నేక్ గేమ్. అయితే ఇదే గేమ్ కొత్త నోకియా 3310లోనూ లభిస్తోంది. కానీ దానికి గ్రాఫిక్స్ జోడించి నూతనంగా తీర్చిదిద్దారు. కనుక ఈ గేమ్‌ను ఆడాలనుకునేవారు నిరభ్యంతరంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసి గేమ్ మజాను ఆస్వాదించవచ్చు.

ధర ఎక్కువ

ఎందుకు కొనకూడదు..?

ఈ ధరలో అన్నీ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. నోకియాలో ఫీచర్లు చాలా తక్కువ కాబట్టి ఈ ఫోన్ కొనకూడదనే సందేహం స్మార్ట్ ఫోన్ అభిమానులకు రావచ్చు.

నో యాప్స్

ఇప్పట్లో యాప్స్ చాలా ముఖ్యమైనవి. సోషల్ మీడియాలో గడపందే జనాలకు నిద్ర కూడా పట్టదుజ అయితే నోకియా 3310లో ఈ యాప్స్ లేకపోవడం నిజంగా కొరతలాంటిదే.

కెమెరా

సెల్ఫీ కెమెరా ఫోన్ల వెంట యూజర్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఫ్రంట్ కెమెరా లేని నోకియా 3310ని వినియోగదారులు ఏ మేర ఆదరిస్తారనే సందేహం కూడా చాలామందికి కలుగుతోంది.

డిస్‌ప్లే తక్కువ

ఫోటోస్ హై రిజల్యూషన్ లో చూసుకోవాలంటూ నోకియా ఫోన్ లో సాధ్యం కాదు. ఇది కూడా కొరతలాంటిదే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3310 Launched in India: 5 Reasons Why You Should - or Shouldn't - Buy the Phone read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot