వన్ ఇయర్ ఇంటర్నెట్ ఉచితం, ఆ ఫోన్ సేల్ ఈ రోజే !

Written By:

గతవారం లాంచింగ్ సమయంలో సంచలనం రేపిన మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2(2017) స్మార్ట్ ఫోన్ ఈ రోజు విక్రయానికి రానుంది. ఈ ఫోన్ కొంటే ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ టెల్ ఇంటర్నెట్ అందిస్తామంటూ మైక్రోమ్యాక్స్ ప్రకటించడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులంతా ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నసంగతి తెలిసిందే.

ప్రశ్న మాది, జవాబు మీది (టెక్ ఇంటర్యూ కామన్ ప్రశ్నలు)

భారత్ లోని అన్ని రిటైల్ అవుట్ లెట్లలో బుధవారం నుంచి ఈ ఫోన్ విక్రయించనున్నట్టు మైక్రోమ్యాక్స్ పేర్కొంది. ఉచిత ఇంటర్నెట్ తో పాటు ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కు ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ను కూడా ఫ్రీ అందించనున్నట్టు మైక్రోమ్యాక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఏకంగా 50 లక్షల ఫోన్ల అమ్మకాలు, దుమ్మురేపిన శాంసంగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధరను కంపెనీ

ఈ ఫోన్ ధరను రూ. 11,999గా నిర్ణయించింది. మైక్రోమ్యాక్స్ రీటెయిల్ అవుట్ లెట్లలో ఈ రోజు నుంచి లభ్యమవుతోంది. ఫోన్ తో పాటు ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ pre-bundled వినియోగదారులకు లభిస్తాయి.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5

ఈ ఫోన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,. ఈ ఫీచర్ తో కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం గమనార్హం. 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగిఉంది. దీంతో పాటు 1-year screen replacement promise కూడా ఇస్తున్నారు.

ర్యామ్

3 జీబీ ర్యామ్ తో పాటు , 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది.

కెమెరా

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

3050 ఎంఏహెచ్ బ్యాటరీ

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Micromax's new Canvas 2 with 1GB daily data, free calls to go on sale today read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting