యూత్‌ను టార్గెట్ చేస్తూ నోకియా డిజైన్ చేసిన విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ లూమియా 620 దేశీయ మార్కెట్లో జనవరి నుంచి లభ్యంకానుంది. ధర రూ.12,450. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన కెమెరా స్సెసిఫికేషన్‌లు క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. లూమియా 620 కీలక ఫీచర్లు...... విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కెమెరా (5 మెగా పిక్సల్ రేర్, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా), స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్, మ్యాపింగ్ అప్లికేషన్స్ (నోకియా మ్యాప్స్, నోకియా డ్రైవ్, నోకియా ట్రాన్స్‌పోర్ట్, నోకియా సిటీలెన్స్), నోకియా మ్యూజిక్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, లైవ్ టైల్స్, ఎక్స్‌బాక్స్ లైవ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, 7జీబి ఆన్‌లైన్ స్కై డ్రైవ్ స్టోరేజ్, ఇంటర్నెట్ ఎక్ప్‌ప్లోరర్ 10.
మార్కెట్లో ‘నోకియా 114’
అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా ‘నోకియా 114’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ నోకియా ఇండియా, ఈ డివైజ్‌ను తన లిస్టింగ్స్‌లో ఉంచింది. కీలక స్పెసిఫికేషన్‌లు:
బరువు ఇంకా చుట్టుకొలత: 80 గ్రాములు, 110 x 46 x 14.8మిల్లీ మీటర్లు,
డిస్‌ప్లే: 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్,