సొంత గడ్డపై చైనా ఫోన్లకు దిమ్మతిరిగే షాక్, హాట్ కేకుల్లా నోకియా 7..

నోకియా తయ ప్రస్థానాన్ని మళ్లీ చాటబోతోందా.. HMd Global లైసెన్స్ తో మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టిన నోకియా పాత రికార్డులను మళ్లీ తిరగరాయబోతుందా....అంటే అవుననే సమాధానం ఇస్తోంది నోకియా 7.

By Hazarath
|

నోకియా తయ ప్రస్థానాన్ని మళ్లీ చాటబోతోందా.. HMd Global లైసెన్స్ తో మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టిన నోకియా పాత రికార్డులను మళ్లీ తిరగరాయబోతుందా....అంటే అవుననే సమాధానం ఇస్తోంది ఆ కంపెనీ నుంచి వచ్చిన నోకియా 7. చైనాలో విడుదలయిన నోకియా 7 ఏకంగా చైనా ఫోన్లకే సవాల్ విసిరిందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అక్కడ నోకియా 7 ఫోన్లపై రిజిస్ట్రేషన్లు నిమిషాల వ్యవధిలోనే లక్షలు దాటాయి.

మరో 3 రోజుల్లో ఐఫోన్ X ఆర్డర్లు, రూ. 89 వేలతో మార్కెట్లోకి, సత్తా ఎంత ?మరో 3 రోజుల్లో ఐఫోన్ X ఆర్డర్లు, రూ. 89 వేలతో మార్కెట్లోకి, సత్తా ఎంత ?

ఒక్క నిమిషంలోనే దాదాపు లక్షా 50 వేల రిజిస్ట్రేషన్లు..

ఒక్క నిమిషంలోనే దాదాపు లక్షా 50 వేల రిజిస్ట్రేషన్లు..

నోకియా 7 గత వారమే చైనా మార్కెట్లోకి అమ్మకానికి వెళ్లింది. అక్కడ పాపులర్ ఈ కామర్స్ సైట్లు అయిన JD.com, Suningలలో ఈ ఫోన్ల రిజిస్ట్రేషన్ల పక్రియను పెట్టారు. అయితే నిమిషాల వ్యవధిలోనే ఈ పక్రియ పూర్తి అయింది. కేవలం ఒక్క నిమిషంలోనే దాదాపు లక్షా 50 వేల రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

 అక్టోబర్ 20న..

అక్టోబర్ 20న..

నోకియా కంపెనీ చైనా మార్కెట్లో అక్టోబర్ 20న తన నోకియా7ను అఫిషియల్ గా లాంచ్ చేసింది. ఆర్డర్లను కూడా అదే రోజు ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆర్డర్లు నిమిషాల వ్యవధిలోనే పూర్తయ్యాయి. NokiaPowerUser రిపోర్టు ప్రకారం JD.com లక్షా 20 వేల రిజిస్ట్రేషన్లు స్వీకరించగా Suningలో 30 వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

సునామి దెబ్బకు తట్టుకోలేని ఆ సైట్లు..

సునామి దెబ్బకు తట్టుకోలేని ఆ సైట్లు..

ఈ సునామి దెబ్బకు తట్టుకోలేని ఆ సైట్లు వెంటనే తమ వైబ్‌సైట్‌లో అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ బోర్డును పెట్టేశాయి. ఫస్ట్ ఫ్లాష్ సేల్ ఇంతలా జరిగితే తరువాతి సేల్ ఎలా ఉంటుందోనని అక్కడ మొబైల్ కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. చైనా ఫోన్లకు కష్టకాలం వచ్చినట్లేనని టెక్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

నోకియా 7 ఫీచర్ల విషయానికొస్తే..

నోకియా 7 ఫీచర్ల విషయానికొస్తే..

5.2 ఇంచ్ ఐపీఎస్ 2.5డీ డిస్‌ప్లే
1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌
64 జీబీ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం
16 మెగాపిక్సెల్‌ రియర్‌కెమరా
5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్
3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ

Nokia OZO spatial audio టెక్నాలజీ

Nokia OZO spatial audio టెక్నాలజీ

Nokia OZO spatial audio టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియోకి కూడా అప్‌డేట్ వర్షన్‌గా ఉంది. నోకియా 6కి, నోకియా 8 కి మధ్య గ్యాప్‌ ను పూర్తి చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ డివైస్‌తో మరోసారి నోకియా తన ప్రాభవాన్ని చాటుకోనుందనే అభిప్రాయం మార్కెట్లో నెలకొంది.

ధర

ధర

అక్టోబర్‌ 31న భారతమార్కెట్లో విడుదల కానుంది. కాగా ఈ ఫోన్ 4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తోంది. 4 జీబీ వేరియంట్ మన కరెన్సీలో సుమారు రూ.25 వేలు కాగా.. 6 జీబీ వేరియంట్ రూ.26500గా ఉంది.

నోకియా 8లో సగం ధరకే, నోకియా 7 వచ్చేసింది !

నోకియా 8లో సగం ధరకే, నోకియా 7 వచ్చేసింది !

నోకియా 8లో సగం ధరకే, నోకియా 7 వచ్చేసింది ! మరింత సమాచారాన్ని పైన క్లిక్ చేసి పొందండి. 

 

 

Best Mobiles in India

English summary
Nokia 7's First Flash Sale Over in Minutes, Received Over 150,000 Registrations: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X