జియో దెబ్బ,నోకియా బనానా ఫోన్‌కి వాట్సప్ ఫీచర్ !

|

ముఖేష్‌ అంబానీకి తన జియోఫోన్‌లో మూడు పాపులర్‌ యాప్స్‌ వాట్సప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లను అందిచనున్నట్లు కంపెనీ AGMఈవెంట్ లో తెలిపిన సంగతి అందరికీ విదితమే. అయితే ఇప్పుడు అదే బాటలో మిగతా ఫీచర్‌ ఫోన్‌ కంపెనీలు కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్లలో సంచలనం రేకెత్తిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన ఫీచర్ ఫోన్ బనానాకు వాట్సప్ అందించనున్నట్లు తెలిపింది.బనానా ఫోన్‌ నోకియా 8110 4జీకి త్వరలోనే వాట్సప్‌ సపోర్టును ఇవ్వనున్నట్టు తెలుపుతూ నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీదారి హెచ్‌ఎండీ గ్లోబల్‌ టీజ్‌చేసింది.

 

షియోమి 4th anniversary sale, రూ.4కే కొన్ని ఉత్పత్తులుషియోమి 4th anniversary sale, రూ.4కే కొన్ని ఉత్పత్తులు

వాట్సప్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు..

నోకియా నుంచి వచ్చిన 8110 4జీ కూడా జియో తరహాలోనే కిఓఎస్‌తో పనిచేస్తోంది. 2018 ఎండబ్ల్యూసీలో హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ ఫోన్‌‌ని లాంచ్‌ చేసింది. దీనికి కూడా వాట్సప్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు హెచ్ ఎండి గ్లోబల్ ఛీప్ ప్రొడక్ట్ ఆఫీసర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

అదిరే ఫీచర్లు

అదిరే ఫీచర్లు

గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ మ్యాప్స్‌, లెజెండరీ స్నేక్‌ గేమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ అప్పడు వాట్సప్‌ సపోర్టును ఈ బనానా ఫోన్‌ అందించలేకపోయింది.

జియో తన ఫీచర్‌ ఫోన్‌కు

జియో తన ఫీచర్‌ ఫోన్‌కు

తాజాగా జియో తన ఫీచర్‌ ఫోన్‌కు వాట్సప్‌ సపోర్టు తేవడంతో, ఇది కూడా తమ నోకియా ఫోన్‌కు త్వరలోనే వాట్సప్‌ అందివ్వనున్నట్టు సంకేతాలిచ్చింది.

బనానా'స్‌లోకి వెళ్లడానికి ..
 

బనానా'స్‌లోకి వెళ్లడానికి ..

‘చూడండి. కిఓఎస్‌లో వాట్సప్‌. ‘బనానా'స్‌లోకి వెళ్లడానికి చూస్తోంది' అని హెచ్‌ఎండీ గ్లోబల్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ జుహో సర్వికాస్‌ ట్వీట్‌ చేశారు. దీంతో త్వరలోనే నోకియా 8110 4జీ లోకి వాట్సప్‌ వస్తున్నట్టు తెలిసింది.

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు

2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర..

ధర..

అమెజాన్ యూకే లో ఈ ఫోన్ ధర £ 78.56(Rs. 7,040) పలుకుతుంది. కాగా ఇప్పటికే అమెజాన్ ప్రీ బుకింగ్స్ కూడా అయిపోయాయి.యూరోపియన్ దేశాలలో లో అమెజాన్ ప్రీ ఆర్డర్స్ మొదలు పెట్టింది . అతి త్వరలో మన దేశంలో కూడా ఈ నోకియా 8110 4జి "బననా " అందుబాటులోకి వస్తుందని నోకియా కంపెనీ తెలిపింది.

జియోఫోన్‌‌ Vs నోకియా 8110 4G

జియోఫోన్‌‌ Vs నోకియా 8110 4G

జియోఫోన్‌‌ Vs నోకియా 8110 4G, సవాల్ చేసే ఫీచర్లు ఏంటీ ?

Best Mobiles in India

English summary
Nokia 8110 4G Will Get WhatsApp, Announcement Comes After JioPhone Update more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X