మార్చి మొదటి వారంలో ‘నోకియా లూమియా 620’

Posted By:

మార్చి మొదటి వారంలో  ‘నోకియా లూమియా 620’
విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా తన లూమియా సిరీస్ నుంచి ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 620'. ఈ విండోస్ 8 స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 28 నుంచి ఆన్‌లైన్ మార్కెట్లో, మార్చి మొదటి వారం నుంచి రిటైల్ మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌ను విక్రయించనున్నారు.

9 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీగా ధర తగ్గింపు!

లూమియా 620ని పలు దేశాల్లో గత వారం విడుదల చేశారు. జర్మన్ మార్కెట్ ధర రూ.19,000, ఇండోనేషియా మార్కెట్ ధర రూ.15,800. ఇండియన్ మార్కెట్లో ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించిన వివరాలను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. లింక్ అడ్రస్:

లూమియా 620 ప్రధాన ఫీచర్లు:

3.8 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),
వై-ఫై, బ్లూటూత్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కలర్ వేరియంట్స్: మెజెంటా, పుసుపు, ముదురు నీలం, తెలుపు, నలుపు,
ప్రీలోడెడ్ అప్లికేషన్స్: నోకియా డ్రైవ్, సిటీ లెన్స్, నోకియా మ్యాప్స్, మిక్స్ రేడియో.

లూమియా 620విడుదలకు సంబంధించి మర్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి. తెలుగు గిజ్‌బాట్ డాట్ కామ్ లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot