‘నోకియా ధర తగ్గింపు’, ఏ ఫోన్‌లకు వర్తించింది..?

Posted By:

దేశీయంగా తమ లూమియా సిరీస్ ఫోన్‌ల అమ్మకాలను మరింతగా పెంచుకునే క్రమంలో నోకియా ఇండియా ఇటీవల విడుదలచేసిన లూమియా 920, లూమియా 820 ఫోన్‌లపై ధర రాయితీని ప్రకటించింది. దేశీయ విపణిలో ఈ హ్యాండ్‌సెట్‌లు విడుదలై నెల రోజులు గడవక మునుపే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి మునుపటి ధరలను పరిశీలించినట్లయితే లూమియా 920 (రూ.38,199), లూమియా 820 (రూ.27,559) ధరలకు లభ్యమయ్యేవి.

నోకియా ఫ్యాక్టరీ.. తమిళనాడు (ఇక్కడే మొబైల్ ఫోన్‌ల తయార్)

ప్రస్తుత ధరలను పరిశీలించినట్లయితే, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ తన తాజా లిస్టింగ్స్‌లో లూమియా 920 ధరను రూ.35,000గా పేర్కొంది. (లింక్ అడ్రస్:). మరో మోడల్ లూమియా 820 ధరను రూ.25,300గా పేర్కొంది. (లింక్ అడ్రస్: ). మరో రిటైలర్ హోమ్‌షాప్18.కామ్ లూమియా 920 ధరను రూ.31,129గా పేర్కొంది. (లింక్ అడ్రస్: )

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు........

లూమియా 920 : విండోస్8 ఆపేరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే టెక్నాలజీ, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్యూర్ వ్యూ బ్రాండింగ్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

లూమియా 820: విండోస్8 ఆపరేటింగ్ సిస్టం , 4.3 అంగుళాల అమోల్డ్ క్లియర్ బ్లాక్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ కెమెరా (ప్యూర్ వ్యూటెక్నాలజీ), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot