ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా.. ?

Written By:

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఏలిన నోకియా కాలం కలిసిరాక పోవడంతో పాటు దూసుకొచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ల దెబ్బకి తెర వెనక్కి వెళ్లిపోయింది. అయితే గత కొంత కాలం నుంచి నోకియా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు సోషల్ మీడియాతో పాటు టెక్ మార్కెట్ ని కూడా కుదిపేస్తున్నాయి .అది నిజమేనా..నోకియా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందా అనే సందేహాలకు తెరదించుతూ ఆండ్రాయిడ్ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నోకియా న్యూ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు లీకయ్యాయి. ఈ ఫోటోలు గీక్ బెంచ్ సైట్లో దర్శనమిచ్చాయి. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ఈ ఫోటోలు మీరే చూడండి.

తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాత ఫోన్ 5320నే

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

మార్కెట్లో లీకయిన ఫోటోల ప్రకారం నోకియా తన పాత ఫోన్ 5320నే సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌గా వినియోగదారులకు ముందుకు తీసుకురాబోతోంది. దీనికే తుది మెరుగులు దిద్దుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి

ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4.4 మీద

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ 2.27GHz quad-core chipset along wth 2GB of RAM తో వచ్చే అవకాశం ఉంది.దీంతో పాటు ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4.4 మీద ఆపరేట్ అయ్యేలా ఈ ఫోన్ ను తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.అయితే ఆండ్రాయిడ్ 7 వస్తున్న నేపథ్యంలో ఇది ఎంత వరకు నిలుస్తుందనేది ప్రశ్నగా మారింది.

Nokia RM-1490 మొబైల్ కి

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

మరోక లీకయిన ఫోన్ ఫోటో ప్రకారం Nokia RM-1490 మొబైల్ కి రీ ప్లేస్ గా వస్తోంది. ఇది single core AMD A8-5545M processor with a clock speed of 500MHzతో వస్తుందని సమాచారం.

2 జిబి ర్యాంతో పాటు చిప్ సెట్ Android 4.2.2 OS,

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

దీనిలో 2 జిబి ర్యాంతో పాటు చిప్ సెట్ Android 4.2.2 OS, తో రానున్నట్లు తెలుస్తోంది. మరి మార్కెట్లో ఇది ఎంత వరకు నిలబడుతుందనేది ప్రశ్నార్థకమే.

నోకియా ఫోన్లు 2016 లో మార్కెట్లోకి

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

కొద్ది వారాల క్రితం చైనా జాయింట్ మేనేజ్ మెంట్ ప్రెసిడెంట్ మైక్ వాంగ్ మాట్లాడుతూ నోకియా ఫోన్లు 2016 లో మార్కెట్లోకి వస్తాయని చెప్పారు. ఇవి మార్కెట్లో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గిజ్‌మో చైనా

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

చైనా వెబ్ సైట్ గిజ్‌మో చైనా కూడా నోకియా స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరమే మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తాయని కథనాలు రాసింది. రానున్న ఫోన్లు స్నాప్ డ్రాగన్ 820 chipsetతో పాటు 2కె డిస్ ప్లే కలిగి ఉంటాయని తెలిపింది.

ఆండ్రాయిడ్ నౌగత్ తో వస్తున్నాయని

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

అయితే ఇవి ఆండ్రాయిడ్ నౌగత్ తో వస్తున్నాయని కథనాలన ఫోటోలతో సహా ఈ సైట్ రాసింది. అయితే ఇప్పుడు లీకయిన ఫోటోలను బట్టి చూస్తే ఇది అసాధ్యమని తెలుస్తోంది. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 7కి చాలాదూరంలో ఉన్నాయని అర్థమవుతోంది.

మార్కెట్లోకి వస్తున్న రూమర్ల ప్రకారం

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

అయితే మార్కెట్లోకి వస్తున్న రూమర్ల ప్రకారం నోకియా ట్యాబ్లెట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోందని సమాచారం.

ట్యాబ్లెట్లతో పాటు నాలుగు నోకియా ఫోన్లను

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

ఈ ట్యాబ్లెట్లతో పాటు నాలుగు నోకియా ఫోన్లను కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నామని నోకియాకు చెందిన ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అవి ఈ ఏడాది వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు.

రానున్న ఫోన్లు మార్కెట్లో ఎంత మేరకు

ఊహకే అందని నోకియా కొత్త ఫోన్లు..మళ్లీ చతికిలపడేందుకేనా..

అయితే రానున్న ఫోన్లు మార్కెట్లో ఎంత మేరకు సత్తా చాటతాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆండ్రాయిడ్ 7 అంటూ మార్కెట్ దూసుకుపోతున్న నేపథ్యంలో కిట్ క్యాట్ తో వచ్చే ఫోన్లు ఏ మేరకు సత్తా చాటుతాయో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Five Leaks Which Confirm That Nokia Smartphones Are Really Launching in 2016!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot