నథింగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
నథింగ్ నుంచి ఇటీవల నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. నథింగ్ సంస్థ నుంచి వచ్చిన తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. త్వరలో మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేసింది. నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ సహా కీలక వివరాలను వెల్లడించింది. X ద్వారా ఈ వివరాలను షేర్ చేసింది.
ఎప్పుడు విడుదల కానుంది? :
నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 3a Lite Smartphone) అక్టోబర్ 29 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు (భారత కాలమానం ప్రకారం 6.30PM) విడుదల కానుంది. ఫోన్ టీజర్‌ను కూడా లాంచ్ చేసింది. దీని ఆధారంగా ఫోన్ బ్యాక్ ప్యానల్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంది.

గ్లిఫ్ లైట్ :
టీజర్ ఆధారంగా విడుదల అయిన బ్యాక్ ప్యానల్ డిజైన్‌లో ఫోన్ సగభాగం వైట్ కలర్‌లో కనిపిస్తోంది. అయితే కింది వైపు కుడి భాగంలో LED లైట్‌ను అమర్చి ఉంది. దీన్ని గ్లిఫ్ లైట్‌గా పనిచేస్తుందని తెలుస్తోంది. ఛార్జింగ్ స్టేటస్ లేదా నోటిఫికేషన్‌లను సూచించే అవకాశం ఉంది.
ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే :
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా నథింగ్ ఫోన్ 3a లైట్ మోడల్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది.
Phone (3a) Lite. 29.10. 13.00 GMT.
— Nothing (@nothing) October 27, 2025
Light up the everyday. pic.twitter.com/VVNclQ6mEl
ఈ లైట్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Nothing OS 4.0 పైన పనిచేసే అవకాశం ఉంది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ నథింగ్ ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కెమెరాలతో 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.21999 గా ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ రూ.23999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నథింగ్ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వైట్, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల కానుందా లేదా అనేదానిపై నథింగ్ ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








