50MP + 50MP + 50MP కెమెరాలు, 6.77 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో ఫోన్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఇవాళ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఇందులో భాగంగా ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్ (Nothing Phone 3a Pro Smartphone launched) మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ప్రో మోడల్ 6.77 అంగుళాల FHD+ (1080*2392 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Panda గ్లాస్ రక్షణను పొందుతుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
నథింగ్ ఫోన్ 3a ప్రో ఫోన్ 4nm ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 Skin On Top ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
కెమెరా వివరాలు :
బేస్ వేరియంట్‌తో పోలిస్తే ప్రో మోడల్ కెమెరా విభాగం పరంగా మరింత మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మరియు 2x జూమ్‌తో 50MP శాంసంగ్ 1/1.56 అంగుళాల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

దీంతోపాటు f/2.55 అపేచర్, OIS, EIS, 6x ఇన్ సెన్సార్, 60x డిజిటల్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్టుతో 50MP సోనీ 1/1.95 అంగుళాల పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
నథింగ్ ఫోన్ 3a ప్రో మోడల్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50 శాతం ఛార్జింగ్ ను కేవలం 19 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని, 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని నథింగ్ తెలిపింది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, 10 కొత్త రింగ్‌టోన్స్, నోటిఫికేషన్ సౌండ్‌ను సపోర్టు చేస్తుంది. గ్లిప్ టైమర్, వాల్యూమ్ ఇండికేటర్, గ్లిఫ్ కంపోజర్, గ్లిఫ్ టార్చ్, గ్లిఫ్ ప్రోగ్రస్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
నథింగ్ ఫోన్ 3a ప్రో ధర, సేల్ వివరాలు :
ఈ ప్రో మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ లో సేల్ మార్చి 11 నుంచి ప్రారంభం కానుంది. విజయ్ సేల్స్, క్రోమ్ ప్లాట్‌ఫాం సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో 15 నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ప్రో మోడల్ బ్లాక్, గ్రే రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








