Home
Mobile

19 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ అయ్యే నథింగ్ ఫోన్ 3a విడుదల.. ట్రిపుల్ కెమెరా సహా సూపర్ ఫీచర్‌లు..!

నథింగ్‌ ఫోన్ 3a సిరీస్ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఈ సిరీస్‌ లో ఫోన్‌ 3a, ఫోన్‌ 3a ప్రో మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. నథింగ్‌ ఫోన్ 3a హ్యాండ్‌సెట్‌ (Nothing phone 3a smartphone launched) FHD+ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. కెమెరా మాడ్యూల్ డిజైన్‌ లో మార్పులను గుర్తించవచ్చు. గత మోడల్ తరహాలోనే గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 3a స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల FHD+ (1080*2392 పిక్సల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ, 1000Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2160Hz PWM ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Panda గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

Nothing phone 3a smartphone display

నథింగ్‌ ఫోన్‌ 3a మోడల్‌ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 (Skin On Top) ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను అందిస్తామని నథింగ్‌ తెలిపింది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్‌, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP శాంసంగ్‌ 1/1.57 అంగుళాల ప్రైమరీ కెమెరా మరియు f/2.0 అపేచర్‌, EIS, 2x ఆప్టికల్‌, 30x డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ కెమెరా, 8MP సోనీ అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

Nothing phone 3a smartphone display

19 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 50 శాతం ఛార్జింగ్‌ ను కేవలం 19 నిమిషాల్లో చేయవచ్చని నథింగ్ చెబుతోంది. 56 నిమిషాల్లో అదే 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. మరియు 10 కొత్త రింగ్‌టోన్స్, నోటిఫికేషన్‌ సౌండ్‌ను సపోర్టు చేస్తుంది. గ్లిప్‌ టైమర్, వాల్యూమ్ ఇండికేటర్‌, గ్లిఫ్‌ కంపోజర్‌, గ్లిఫ్‌ టార్చ్‌, గ్లిఫ్‌ ప్రోగ్రస్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

Nothing phone 3a smartphone display

నథింగ్‌ ఫోన్‌ 3a ధర సేల్‌ వివరాలు :
నథింగ్‌ ఫోన్‌ 3a (Nothing Phone 3a sale date) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. మార్చి 11 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, విజయ్‌ సేల్స్‌, క్రోమా వంటి స్టో్ర్‌ లోనూ కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing phone 3a smartphone launched with triple camera and snapdragon 7s Gen 3 Chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X