Home
Mobile

Nothing Phone 3a Pro Vs OPPO F29 Pro రూ.30 వేల ధరలో ఏది బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్..?

భారత్‌ మార్కెట్‌లో గత ఈ మూడు నెలల్లో వివిధ స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఎంట్రీ లెవల్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఒకే సెగ్మెంట్‌లో అనేక మోడల్స్‌ ఉన్నాయి. వీటిలో ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం రూ.30,000 ధర సెగ్మెంట్‌లో ప్రస్తుతం నథింగ్ ఫోన్ 3a ప్రో, ఒప్పో F29 ప్రో ఫోన్‌లు (Nothing Phone 3a Pro Vs OPPO F29 Pro) ఉన్నాయి. వీటితో ఏ ఫోన్ ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంది, మరియు మీ అవసరాలకు ఈ ఫోన్‌ సరిపోతుందా లేదో చూద్దాం.

నథింగ్‌ సంస్థ ఈ నెల తొలివారంలో నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా ఫోన్‌ 3a, ఫోన్‌ 3a ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బేస్‌ వేరియంట్ కంటే ప్రో మోడల్‌ అనేక బెస్ట్‌ ఫీచర్లను కలిగి ఉంది. అదే విధంగా ఒప్పో F29 సిరీస్‌లో భాగంగా F29 5G, F29 ప్రో 5G ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. రూ.30 వేల ధరలో ఈ రెండు అందుబాటులోకి వచ్చాయి.

Nothing Phone 3a Pro Vs OPPO F29 Pro

* నథింగ్‌ ఫోన్‌ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ :
నథింగ్‌ ఫోన్‌ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 3a Pro Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ గరిష్ఠ, 1000Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2160Hz PWM కలిగి ఉంది. మరియు Panda గ్లాస్‌ రక్షణను పొందుతుంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 50MP శాంసంగ్‌ ప్రైమరీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS, EIS, 2x జూమ్‌ను కలిగి ఉంటుంది. 60X డిజిటల్‌ జూమ్, 6X ఇన్‌ సెన్సార్‌, 3X ఆప్టికల్ జూమ్ సపోర్టుతో 50MP సోనీ పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరానును కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 (Skin On Top) తో పనిచేస్తోంది. 4nm ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

నథింగ్‌ ఫోన్ 3a ప్రో 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని నథింగ్ చెబుతోంది. గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌, 10 కొత్త రింగ్‌టోన్స్, నోటిఫికేషన్‌ సౌండ్‌, గ్లిప్‌ టైమర్, వాల్యూమ్ ఇండికేటర్‌, గ్లిఫ్‌ కంపోజర్‌, గ్లిఫ్‌ టార్చ్‌, గ్లిఫ్‌ ప్రోగ్రస్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్ 3a ప్రో హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999 గా ఉంది. ఈ ఫోన్‌ను గ్రే, బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

* ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H 2022 డ్రాప్‌ రెసిస్టెంట్‌, 360 డిగ్రీల ఆర్మర్‌ బాడీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ (OPPO F29 Pro Smartphone) వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ OIS కెమెరా, 2MP సెకండరీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ మెయిన్ కెమెరా AI LivePhoto, AI Eraser 2.0, AI అన్‌బ్లర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. అండర్ వాటర్‌ ఫోటోగ్రఫీ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15.0 తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని ఒప్పో తెలిపింది.

ఈ ఫోన్‌ మెరుగైన సిగ్నల్ కనెక్టివిటీ కోసం AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్‌ యాంటెనా ను వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31,999 గా ఉంది. గ్రానైట్‌ బ్లాక్‌, మార్బుల్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ సూపర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ డిజైన్‌తోపాటు అండర్‌ వాటర్ ఫోటోగ్రఫీ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. అదే నథింగ్‌ ఫోన్‌ సూపర్‌ కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఎక్కువ సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తోంది.

పనితీరు ఆధారంగా సుమారుగా ఒకే తరహా పెర్ఫామెన్స్‌ను అందించే అవకాశం ఉంది. అయితే నథింగ్ ఫోన్ UFS 2.1 స్టోరేజీతో ఉండే.. ఒప్పో ఫోన్ UFS 3.1 గా ఉంది. మరియు ఒప్పో ఫోన్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే నథింగ్‌ ఫోన్‌ 5000mAh బ్యాటరీతో లాంచ్ అయింది. మీ అవసరాలకు అనుగుణంగా ఈ రెండు ఫోన్‌లలో ఒకదానికి కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3a Pro Vs OPPO F29 Pro which is the best smartphone under Rs30000 price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X