Nothing Phone 3a : నథింగ్ ఫోన్ 3a సిరీస్ డిజైన్ విడుదల.. తొలిసారిగా కీలక మార్పులు..!
నథింగ్ నుంచి మార్చి 4 వ తేదీన నథింగ్ ఫోన్ 3a సిరీస్ లాంచ్ కానుంది. ఈ సిరీస్ లో భాగంగా ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో మోడళ్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. దీంతోపాటు సంస్థ కూడా కొన్ని స్పెసిఫికేషన్ లు, డిజైన్ హింట్ లు ఇచ్చింది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ పూర్తి డిజైన్ ను నథింగ్ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా (Nothing Phone 3a Series Design) విడుదల చేసింది. ఈ డిజైన్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఈ సిరీస్ లో తొలిసారి అనేక మార్పులను గమనించవచ్చు.
కెమెరా మాడ్యూల్ పరంగా కీలక అప్‌గ్రేడ్ :
గత మోడల్స్‌తో పోలిస్తే డిజైన్ పరంగా ఫోన్ అప్‌గ్రేడ్ అయింది. ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ లో కీలక మార్పులను గమనించవచ్చు. ఈ డిజైన్ ఆధారంగా పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ఆధారంగా ఈ మోడల్ నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ గా తెలుస్తోంది.

గ్లాస్ బ్యాక్ ప్యానల్ :
నథింగ్ షేర్ చేసిన డిజైన్ ఆధారంగా ఈ ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. మరియు మూడు సెన్సార్‌లను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్‌లతో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంటుంది.
పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా :
ఇప్పటికే విడుదల అయిన వివరాలు ఆధారంగా ప్రో మోడల్ OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ పెరిస్కోప్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు కూడా 50MP లెన్స్‌తో అందుబాటులోకి వస్తుంది.
Meet Phone (3a) Series. First hands-on experience with NEO Gamma.@1x_tech pic.twitter.com/U7vuinDVR7
— Nothing (@nothing) February 24, 2025
బేస్ వేరియంట్ ఎలా ఉండనుంది? :
ప్రో మోడల్ కెమెరా మాడ్యూల్‌తోపాటు వాల్యూమ్, పవర్ బటన్‌లను కుడివైపున గమనించవచ్చు. దీంతోపాటు నథింగ్ ఫోన్ 3a హ్యాండ్‌సెట్ పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అయితే బేస్ వేరియంట్ కూడా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
బేస్ వేరియంట్ OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటోను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Phone (3a) Series.
— Nothing (@nothing) February 24, 2025
Where technical intricacy meets purity. The essence of Nothing. pic.twitter.com/02UEwkgROl
తొలిసారి స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
నథింగ్ ఫోన్ 3a సిరీస్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు నథింగ్ OS 3 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. గత మోడళ్ల తరహాలోనే సెమీ ట్రాన్స్‌పరెంట్ డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.
డిస్‌ప్లే అంచనా వివరాలు :
ఈ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే పైన తెలిపిన కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై నథింగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మార్చి 4 వ తేదీన ఈ సిరీస్ లాంచ్ కానుంది. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తొలిసారిగా నథింగ్ ఫోన్లు ట్రిపుల్ కెమెరాలు పెరిస్కోప్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








