50MP + 50MP కెమెరాలు, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..!
Nothing Phone 4a Pro Smartphone : నథింగ్ ఫోన్ 4a సిరీస్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. నథింగ్ ఫోన్ 4a తోపాటు ఫోన్ 4a ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ 4a మోడల్ గ్లిఫ్ బార్‌ను కలిగి ఉంది. అదే ప్రో మోడల్ గ్లిప్ మ్యాట్రిక్స్ ఇంటర్‌ఫేస్‌తో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ చిప్, ఫాస్ట్ ఛార్జింగ్, రెండు 50MP కెమెరాలతోపాటు, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2500 టచ్ శాంప్లింగ్ రేట్, 2160PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఇందులో 137 మినీ LED లు ఉన్నాయి. ఈ లైటింగ్ సిస్టమ్ 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. బ్యాటరీ, టైమర్, డిజిటల్ క్లాక్, గ్లిఫ్ మిర్రర్ ఫీచర్లు ఉన్నాయి. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 12GB LPDDR5x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ OS 4.1 పైన పనిచేస్తుంది.
ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. 50W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంది. 1-100 శాతం ఛార్జింగ్‌ను 64 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని నథింగ్ చెబుతోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 700c ప్రైమరీ కెమెరా ఉంది. 140x అల్ట్రాజూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 6, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. యాంబియంట్ లైట్, యాక్సెలిరోమీటర్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్‌లు ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.42999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.45999 గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ సేల్ మార్చి 27 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, పింక్, సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








