మార్కెట్‌ను షేక్ చేసేందుకు కొత్త మొబైల్ రెడీ..

Written By:

నూబియా నుంచి సరికొత్త ఫోన్ జూన్ 1న రాబోతోంది. నూబియా జడ్17 పేరుతో ఈ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. జూన్ 1న చైనాలో ఈఫోన్ కి లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆర్టిపీషయల్ ఇంటిలిజెన్స్ తో పాటు 23 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాను ఈ ఫోన్ లో పొందుపరిచారు. ధర విషయాలు ప్రకటించనప్పటికీ మార్కెట్లో ఇది మరో సంచలనంగా మారే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. పీచర్ల విషయానికొస్తే..

యుఎస్‌కి అదిరే షాక్.. ఈ ఫోటోలే సాక్ష్యం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ని పొందుపరిచారు. ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది

ర్యామ్

4జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ని Nubia Z17లో పొందుపరిచారు.మరికొన్ని రిపోర్టుల ప్రకారం ఈ మొబైల్ 6/8 జిబి ర్యామ్ లతో వస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 23మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ అభిమానుల కోసం 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

అదనపు ఆకర్షణలు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ లాంటివి అదనపు ఆకర్షణలు

 

 

సిల్వర్, గోల్డ్ కలర్స్

సిల్వర్, గోల్డ్ కలర్స్ లో తో పాటు బ్లూ కలర్స్ లో కూడా ఫోన్ లభ్యమవుతుందని లీకయిన రిపోర్టులన బట్టి తెలుస్తుంది. 

చైనాలో లాంచ్ అయిన వెంటనే ఇండియాకి

ముఖ్యంగా ఇది వాటర్ ఫ్రూప్ సిస్టంతో రాబోతుందని సమాచారం. చైనాలో లాంచ్ అయిన వెంటనే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. ధర వివరాలను మాత్రం లాంచిగ్ రోజే ప్రకటిస్తారని తెలుస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nubia Z17 with dual camera setup launching on June 1 Read more At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot