Home
Mobile

OnePlus 13T వచ్చేస్తోంది.. 50MP డ్యూయల్ కెమెరా, 6200mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్‌తో.. పూర్తి వివరాలు..

OnePlus 13T: వన్‌ప్లస్ లవర్స్‌కు ఆ కంపెనీ నుంచి శుభవార్త అందింది. తమ కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13Tని ఏప్రిల్ 2025 లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొదట్లో దీన్ని వన్‌ప్లస్ 13 మినీ పేరుతో తీసుకొస్తారని వార్తలు వచ్చినా, ఇప్పుడు 13T బ్రాండింగ్‌తోనే మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే, మన దేశంలో ఎప్పుడు వస్తుందనే కచ్చితమైన తేదీ ఇంకా చెప్పలేదు.

ముందుగా చైనాలో విడుదలై, ఆ తర్వాత ఒకట్రెండు నెలల్లో భారతదేశంలో విడుదల కావచ్చు. "స్మాల్ స్క్రీన్ పవర్‌హౌస్" (చిన్న స్క్రీన్‌లో అద్భుతమైన శక్తి) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్‌ను ప్రచారం చేస్తున్నారు. ఇందులో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కళ్లకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

OnePlus 13T Launching April 2025  Snapdragon 8 Elite Chip  Massive 6200mAh Battery and 50MP Camera Powerhouse

50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌తో రూ.7,000లోపే.. టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇదిగో!
స్క్రీన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. చేతిలో ఇమిడిపోయే చిన్న ఫోన్ కావాలి, కానీ వేగం, పనితీరులో రాజీ పడకూడదు అనుకునే వారి కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ చిప్‌సెట్ వాడుతున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న అత్యంత అందుబాటు ధర ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఇదొకటి కానుంది.

* బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా... అన్నీ అదుర్సే..

ఈ ఫోన్‌లో కెమెరా, ప్రాసెసర్ ఎంత పవర్‌ఫులో, బ్యాటరీ అంత కంటే ఎక్కువ పవర్‌ఫుల్. ఇందులో ఏకంగా 6200mAh భారీ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది సాధారణ OnePlus 13 మోడల్‌లోని 6000mAh బ్యాటరీ కంటే కూడా ఎక్కువ. అంతేకాదు, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, అంటే ఫోన్ క్షణాల్లో ఛార్జ్ అవుతుంది.

* OnePlus 13T కెమెరాలు

కెమెరాల విషయానికొస్తే, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఒకటి 50MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో), రెండోది 50MP టెలిఫోటో లెన్స్ (2x ఆప్టికల్ జూమ్‌తో) ఉండే అవకాశం ఉంది. డిజైన్ విషయంలో ఇది ఒప్పో 13 సిరీస్‌ను పోలి ఉంటుందని, చతురస్రాకార కెమెరా మాడ్యూల్ ఉంటుందని టాక్.

* ధర ఎంత ఉండొచ్చు? ఎప్పుడు చేతికొస్తుంది?

మరి ధర ఎంత? ఈ విషయంపై వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. కానీ చైనాలో దీని ధర సుమారు రూ.54,990 ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఇదే నిజమైతే, ప్రీమియం విభాగంలో ఇది మంచి పోటీనిచ్చే ధర అనే చెప్పాలి. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ (OxygenOS) 15తో వస్తుందని సమాచారం.

అంటే మీకు సరికొత్త, వేగవంతమైన సాఫ్ట్‌వేర్ అనుభూతి లభిస్తుంది. ఈ ఫోన్ విడుదల గురించి వన్‌ప్లస్ సంస్థ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ వివరాలను కేవలం అంచనాలుగా మాత్రమే పరిగణించడం మంచిది. వన్‌ప్లస్ 13T గురించి కచ్చితమైన సమాచారం వెలువడిన వెంటనే తెలుగు గిజ్ బాట్ వెబ్‌సైట్ ద్వానా మరిన్ని వివరాలు తెలియజేస్తాం. తాజా అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి.

Best Mobiles in India

English summary
The OnePlus 13T, launching in April 2025, features a 6200mAh battery, Snapdragon 8 Elite chip, and dual 50MP cameras. Price starts around Rs.54,990.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X