OnePlus 15 Smartphone : భారత్‌లో వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందంటే..?
OnePlus 15 Smartphone india Launch : వన్‌ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ ఇటీవల చైనా మార్కెట్ లో లాంచ్ అయింది. దీంతోపాటు వన్‌ప్లస్ ఏస్ 6 హ్యాండ్‌సెట్ (భారత్‌లో వన్‌ప్లస్ 15R గా విడుదలయ్యే అవకాశం ఉంది) కూడా అందుబాటులోకి వచ్చింది. భారత్ మార్కెట్ లో త్వరలో వన్‌ప్లస్ 15 హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఇప్పటికే హ్యాండ్‌సెట్ కీలక స్పెసిఫికేషన్ ల వివరాలు వెల్లడి కాగా.. తాజాగా విడుదల తేదీ సహా మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వన్‌ప్లస్ ఇండియా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ వివరాలను షేర్ చేసింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుంది :
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో నవంబర్ 13 వ తేదీ 7PM IST గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ కూడా అదే రోజు ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ లో అదే రోజు 8PM IST గంటల నుంచి ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ద్వారా అందుబాటులోకి :
అనంతరం అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. అమెజాన్ మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ DetailMax Engine తో వెనుక వైపు మూడు 50MP కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ చిప్‌తో తొలి ఫోన్! :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ ను ఇటీవలే క్వాల్‌కాం లాంచ్ చేసింది. ఈ చిప్‌సెట్‌తో లాంచ్ అయిన తొలి ఫోన్ గా వన్‌ప్లస్ 15 నిలవనుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 పైన పనిచేస్తుంది. అడ్వాన్స్‌డ్ బిల్ట్ ఇన్ AI ఫీచర్లు ఉంటాయి.
Stay tuned: https://t.co/WfFwzaDgTt
— OnePlus India (@OnePlus_IN) October 29, 2025
The new identity of power.
Revealing November 13. #OnePlus15 pic.twitter.com/tvrggPQacW
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
చైనా వేరియంట్ తరహాలోనే అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. చైనాలో ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5K BOE X3 8T LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 3999 Yuan (భారత కరెన్సీ ప్రకారం రూ.49,500) గా ఉంది.
చైనా వేరియంట్ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

భారీ బ్యాటరీ ఫోన్ :
చైనాలో ఈ ఫోన్ 120W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు IP66, IP68, IP69, IP69K రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. సెక్యూరిటీ కోసం అల్ట్రా సోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








