Home
Mobile

వన్‌ప్లస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. తాజాగా కీలక వివరాలు లీక్..!

భారత్‌ మార్కెట్‌ లో వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 13 వ తేదీన విడుదల అయింది. లేటెస్ట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది. 7300mAh బ్యాటరీతో అందుబాటలోకి వచ్చింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. అయితే ఇదే సిరీస్‌ నుంచి మరో ఫోన్‌ ఇండియా మార్కెట్‌ లో లాంచ్‌ కానుంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి.

వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 15R Smartphone) లాంచ్‌ ఈవెంట్‌ లో వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్ విడుదల గురించి ఆ సం‌స్థ అధికార ప్రతినిధి వివరాలు వెల్లడించారు. త్వరలో విడుదల కానుందని చెప్పారు. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.

oneplus 15R

వచ్చే నెలలో విడుదల కానుందా? :
ప్రస్తుత అంచనా వివరాల ఆధారంగా ఈ వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్లలో వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. భారత్‌ లోనూ అదే సమయంలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఇటీవల చైనాలో విడుదల అయిన వన్‌ప్లస్ ఏస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌ గా రానుందని తెలుస్తోంది.

అంచనా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్‌ ఏస్‌ 6 తరహాలోనే అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. చైనాలో విడుదల అయిన ఈ హ్యాండ్‌సెట్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.83 అంగుళాల 1.5K (1272 x 2800 పిక్సల్స్‌) ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది.

7800mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్‌ లెన్స్‌ ను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరా అమర్చి ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 120W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7800mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ ప్రాసెసర్ :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. IP66/68/69/69K డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

చైనా మార్కెట్‌ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2599 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.32,300) గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 16GB/256GB, 12GB/512GB, 16GB/512GB, 16GB/1TB స్టోరేజీ వేరియంట్స్‌ లో కూడా అందుబాటులో ఉంది.

భారత్‌లో వన్‌ప్లస్‌ 15R హ్యాండ్‌సెట్‌ విడుదల సహా ఇతర స్పెసిఫికేషన్‌ లు ఫీచర్లపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతోపాటు ధర వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
oneplus 15R smartphone teased, here are the expected launch timeline and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X