23 ఎంపీ కెమెరా, 6జిబి ర్యామ్, ఆ 3 ఫోన్లకు సవాలే..?

Written By:

వన్‌ప్లస్ కంపెనీ నుంచి వన్‌ప్లస్ 5 అతి త్వరలో దూసుకొస్తోందని రూమర్లు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో లీకయ్యాయి. డ్యూయెల్ ఎడ్జ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ గెలాక్సీ ఎస్8, LG G6, Huawei P10లకు గట్టిపోటీనిస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తున్న ఈ ఫోన్ ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో లీకయిన ఈ ఫోన్ ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

అదిరే ఫీచర్లతో దూసుకొచ్చిన LG G6

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యూయెల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో

ఓ కొరియన్ వెబ్‌సైట్‌లో వన్‌ప్లస్ 5 సంబంధించిన వివరాలు లీకయ్యాయి. డ్యూయెల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో పాటు గ్లాస్ బాడితో ఈ ఫోన్ రానున్నట్లు లీకయిన వివరాలు చెబుతున్నాయి. కొరియన్ వెబ్‌సైట్‌ Koreanportal.com ప్రకారం 4 అనేది కంపెనీకి అన్ లక్కీ నెంబరని అందుకే దాన్ని స్కిప్ చేసి దాని స్థానంలో 5తో సరికొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ ని తెస్తుందని తెలిపింది.

6జిబి ర్యామ్‌

స్నాప్ డ్రాగన్ 830తో పాటు వైర్ లెస్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ రానుంది. 6జిబి ర్యామ్‌తో పాటు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫోన్ రానుందని తెలుస్తోంది. అలాగే 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడా ఫోన్ వచ్చే అవకాశం ఉందని లీకయిన వివరాలు చెబుతున్నాయి.

23 ఎంపీ కెమెరా

రానున్న వన్‌ప్లస్ 5లో హైలెట్ ఫీచర్ ఏంటంటే కెమెరా.23 ఎంపీ కెమెరాతో ఫోటోలను అత్యంత ఆకర్షణీయంగా హెచ్‌డి క్వాలిటీలో తీయవచ్చని సమాచారం. సెల్ఫీ షూటర్ విషయానికొస్తే 16 ఎంపీ సెల్ఫీ షూటర్‌ని పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.

4,000mAh battery

బ్యాటరీ విషయానికొస్తే 4,000mAh batteryతో ఫోన్ రానుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు వైర్ లెస్ ఛార్జింగ్ ని కూడా వన్‌ప్లస్ 5లో పొందుపరిచారు. యుఎస్ బి టైప్ ఫోర్ట్ ఛార్జింగ్.

LG G6, Huawei P10లకు ఫోన్లను గట్టి సవాల్

వన్‌ప్లస్ 5 ఫోన్ మార్కెట్లోకి వస్తే ఎస్8, LG G6, Huawei P10లకు ఫోన్లను గట్టి సవాల్ విసురుతుందని టెక్ విశ్లేషకులు అలాగే రూమర్లు తెలియజేస్తున్నాయి. 

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో అనౌన్స్ చేసే అవకాశం

ఈ ఫోన్ వివరాలను కంపెనీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటిదాకా ఈ ఫోన్ గురించిన వివరాలు రూమర్లుగానే పరిగణించాలి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 features leaked: Dual-edge curved display with glass body and 23MP camera Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot