ఐఫోన్ 7లోని ఇంత వరస్ట్ ఫీచర్‌ని వన్‌ప్లస్ 5లో కాపీ కొట్టారా..?

Written By:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సత్తా చాటుతున్న వన్‌ప్లస్ ఐపోన్ 7లోని ఓ వరస్ట్ ఫీచర్ ని కాపి కొట్టినట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. త్వరలో రానున్న వన్‌ప్లస్ 5లో ఈ వరస్ట్ ఫీచర్ ఉండబోతుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్ననాయి. 2017లో తీసుకురాబోతున్నారంటూ ఎక్కువగా అంచనావేసిన ఫోన్లలో ఈ వన్ ప్లస్5 కూడా ఉంది.

వాట్సప్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొన్ని ఫీచర్లను

ఐఫోన్ లెవల్ క్వాలిటీలో దీన్ని లాంచ్ చేస్తారని టెక్ అభిమానులు అంచనావేస్తున్నారు. కొన్ని ఫీచర్లను సైతం ఆపిల్ నుంచి వన్ ప్లస్ కాఫీకొడుతుందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే భాగంగానే ఐఫోన్ 7లో లేని ఓ ఫీచర్ ను, వన్‌ప్లస్ 5 కూడా తన స్మార్ట్ ఫోన్ లో అందించడం లేదని రిపోర్టులు చెబుతున్నాయి.

3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్

అదేమిటంటే 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్. హెడ్ ఫోన్ జాక్ లేకుండానే ఐఫోన్7 మాదిరిగా వన్‌ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి రానుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. అంటే ఇది కేవలం బ్లూటూత్ హెడ్ ఫోన్లపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాయి.

మరేదైనా సరికొత్త టెక్నాలజీని

హెడ్ ఫోన్ జాక్ అందించకపోతుండటంతో, ఐఫోన్ 7 మాదిరిగా, వన్‌ప్లస్ కూడా తన స్మార్ట్ ఫోన్ లో మరేదైనా సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తారా? అని టెక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

వన్ ప్లస్ 5కు సంబంధించిన ఇమేజ్ లను

వన్ ప్లస్ 5కు సంబంధించిన ఇమేజ్ లను చైనీస్ సోషల్ మీడియా సైట్ వైబో షేర్ చేసింది. లీక్ చేసిన ఈ ఫోటోలో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ లెన్స్ కెమెరా, విలక్షణమైన వన్‌ప్లస్ లోగో కనిపిస్తోంది..

ఈ విషయంపై వన్‌ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన

కానీ ఈ విషయంపై వన్‌ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అసలు హెడ్ ఫోన్ జాక్ ఇస్తుందా ? లేదా? అ‍న్నది అప్పుడే క్లారిటీగా తెలుస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. ఐఫోన్ 7లో హెడ్ ఫోన్ జాక్స్ లేకపోవడం టెక్ అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 leak shows it could copy the iPhone 7's WORST feature read more aat gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot