OnePlus 8 & 8 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ల భారీ ధరలు లీక్...

|

ఇండియాలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు అధిక డిమాండ్ ఉంది. ఈ సంస్థ నుంచి ఏదైనా కొత్త ఫోన్ వస్తోంది అంటే దాని మీద చాలా ఊహాగానాలు ఉంటాయి. ఇప్పుడు వన్‌ప్లస్ సంస్థ నుండి వస్తున్న వన్‌ప్లస్ 8 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అయిన వన్‌ప్లస్ 8 మరియు 8 ప్రో లు ఏప్రిల్ 14న విడుదల కానున్నాయి. అయితే ఇప్పటికే ఆన్‌లైన్‌లో వీటి యొక్క ధరలు మరియు స్పెసిఫికేషన్ లు లీక్ అయ్యాయి.

వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 ప్రో

వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 ప్రో

వన్‌ప్లస్ సంస్థ యొక్క కొత్త రెండు స్మార్ట్‌ఫోన్‌లైన వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 ప్రోలు 5G సపోర్ట్‌ను కలిగి ఉండి స్నాప్‌డ్రాగన్ 865 తో రన్ అవుతుంది. కొద్ది రోజుల క్రితం వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా వన్‌ప్లస్ 8 ప్రో యునైటెడ్ స్టేట్స్‌లో $999 ధరను దాటదని పేర్కొన్నారు. విన్‌ఫ్యూచర్ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం వన్‌ప్లస్ 8 €719 వద్ద ప్రారంభమవుతుండగా, వన్‌ప్లస్ 8 ప్రో € 919 వద్ద ప్రారంభమవుతుందని పేర్కొంది. వన్‌ప్లస్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ఇండియా యొక్క ధరలు వెల్లడించలేదు. కాని అవి రూ.39,999 నుండి ప్రారంభమవుతాయని ఆశించవచ్చు. వన్‌ప్లస్ సంస్థ ఇండియాలో మొదటి సారి వన్‌ప్లస్ 8 సిరీస్ తో తన 5Gవేరియంట్‌లను విడుదల చేస్తున్నది.

లీక్ అయిన వన్‌ప్లస్ 8 సిరీస్ ధరలు

లీక్ అయిన వన్‌ప్లస్ 8 సిరీస్ ధరలు

లీక్ అయిన సమాచారం ప్రకారం వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్‌ 8GB + 128GB మరియు 12GB + 256GB రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి యొక్క ధరలు వరుసగా € 719 (సుమారు రూ. 59,700) మరియు € 819 (సుమారుగా రూ. 67,200). మరోవైపు వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కూడా రెండు వేరియంట్ లలో లభిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ధరతో వీటి యొక్క ధరలు వరుసగా € 919 (సుమారు రూ.75,500) మరియు € 1009 (సుమారు రూ.82,900). వన్‌ప్లస్ సంస్థ నుంచి వస్తున్న ఈ ఫోన్లు యొక్క 5G వేరియంట్లయొక్క యూరోపియన్ మార్కెట్ ధరలు మాత్రమే ఇవి అని గమనించండి.

లీక్ అయిన వన్‌ప్లస్ 8 సిరీస్ స్పెసిఫికేషన్స్

లీక్ అయిన వన్‌ప్లస్ 8 సిరీస్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్లు 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉండి FHD + డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది మరియు ఇది 402 PPI, 20: 9 నిష్పత్తితో గల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్ మీద ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్‌లోని డిస్ప్లే HDR 10+ కి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 5G సపోర్ట్ మరియు ఎన్‌ఎఫ్‌సితో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 865 SoC చేత రన్ అవుతుంది. ఈ ఫోన్‌ 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

 

స్కూలు పిల్లలకు ఆన్‌లైన్‌‌లో ఉచిత విద్యస్కూలు పిల్లలకు ఆన్‌లైన్‌‌లో ఉచిత విద్య

ఆప్టిక్స్

ఆప్టిక్స్

ఆప్టిక్స్ విషయానికొస్తే వన్‌ప్లస్ 8 లో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ ఎఫ్ / 1.75 ఎపర్చర్‌తో ఉంటుంది. ఈ సెన్సార్ OIS మరియు EIS లకు కూడా మద్దతు ఇస్తుంది. దీనితో పాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 116-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో ఉంటుంది. 1.75 మైక్రాన్ పిక్సెల్ సైజు మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో మూడవ 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. అలాగే దీని వెనుకవైపు డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెటప్ PDAF మరియు కాంట్రాస్ట్-బేస్డ్ ఆటో ఫోకస్‌కు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు ఫిక్స్‌డ్ ఫోకస్ మరియు EIS తో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Oneplus 8 Series Price, Specs Leaked Online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X