Just In
- 13 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 15 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 16 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 17 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Movies
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
OnePlus Pay: పేమెంట్ సర్వీసులలోకి వన్‌ప్లస్ గ్రాండ్ ఎంట్రీ...
చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈరోజు తన పేమెంట్ సర్వీసులను "వన్‌ప్లస్ పే"ను లాంచ్ చేసింది. ఈ పేమెంట్ సర్వీసును మొదటిసారిగా 2019 లోనే కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ పే సర్వీసును గత ఏడాది సెప్టెంబర్‌లో వన్‌ప్లస్ 7T ని లాంచ్ చేస్తున్నప్పుడు సంస్థ మొదటిసారిగా "వన్‌ప్లస్ పే" సర్వీస్ పేరును ప్రకటించింది.

వన్‌ప్లస్ పే
దాదాపు ఆరు నెలల తరువాత "వన్‌ప్లస్ పే" ను ఈ రోజు చైనాలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీస్ ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యొక్క స్వదేశానికి మాత్రమే పరిమితం అయింది. వన్‌ప్లస్ పే సర్వీస్ ప్రస్తుతం వన్‌ప్లస్ 7T మరియు వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అదికూడా కొన్ని బ్యాంక్ కార్డులు మాత్రమే ప్రస్తుతం పేమెంట్ వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాయి. ఈ పేమెంట్ సర్వీసును వన్‌ప్లస్ సంస్థ ఇండియాలో ఎప్పుడు ప్రారంభిస్తుందో అన్న దాని మీద ఎటువంటి సమాచారంను వెల్లడించలేదు.

వన్‌ప్లస్ పే సర్వీస్ పూర్తి వివరాలు
వన్‌ప్లస్ సంస్థ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లైన వన్‌ప్లస్ 7T మరియు వన్‌ప్లస్ 7T ప్రోలో దీని పేమెంట్ సర్వీసులకు మద్దతు ఉంది. వన్‌ప్లస్ పే అనేది డిజిటల్ వాలెట్ మరియు చెల్లింపు పరిష్కారం. ఇది షియోమి యొక్క Mi పే మరియు శామ్‌సంగ్ పే మాదిరిగానే పనిచేస్తుంది. వన్‌ప్లస్ పే అనేది NFC లేదా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC ) చెల్లింపుల సర్వీస్. ఇది హైడ్రోజెన్ఓఎస్ (గూగుల్ ప్లే సర్వీసెస్ లేకుండా చైనాలో ఆక్సిజన్ఓఎస్‌కు ప్రత్యామ్నాయం) లో ఉన్న వన్‌ప్లస్ పే యాప్ ద్వారా పేమెంట్స్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

వన్‌ప్లస్ పే సర్వీస్
ప్రస్తుతం వన్‌ప్లస్ పే సర్వీస్ అనేది పరిమిత సంఖ్యలో మాత్రమే బ్యాంకింగ్ కార్డులకు మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ మరిన్ని కార్డులకు కూడా కంపెనీ హామీ ఇచ్చింది. ఇవి అన్ని కూడా వన్‌ప్లస్ ఫోన్‌లలో త్వరలోనే మద్దతును పొందుతాయి. ఫోన్ ను అన్‌లాక్ చేయడం ద్వారా ప్రతిసారీ యాప్ ను ఓపెన్ చేసే ఇబ్బందిని తొలగించడానికి పవర్ బటన్‌ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా వన్‌ప్లస్ 7T మరియు 7T ప్రో వినియోగదారులను వన్‌ప్లస్ పేను త్వరగా ప్రారంభించడానికి అనుమతిస్తుంది.
Internet స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించిన Facebook, Instagram

ఈ ఏడాది చివర్లో భారత్‌కు వన్‌ప్లస్ పే సర్వీస్
వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికే భారతీయ మార్కెట్ లో కూడా ‘వన్‌ప్లస్ పే' సర్వీసును ప్రారంభించాలని చూస్తున్నది. భారతదేశంలో NFC ఆధారిత పేమెంట్స్ ఇంకా ప్రాచుర్యం పొందలేదు. వివిధ కంపెనీల యొక్క డిజిటల్ పేమెంట్స్ ఇప్పటి వరకు UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లో మాత్రమే పనిచేస్తున్నాయి. ఏదేమైనా శామ్సంగ్ యొక్క కొన్ని హై-ఎండ్ పరికరాలు భారతదేశంలో కూడా NFC- ఆధారిత శామ్సంగ్ పేను అందిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్ సంస్థల పేమెంట్ సర్వీసులు
ఇటీవలి కాలంలో చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు డిజిటల్ పేమెంట్ సర్వీసులను కూడా ప్రారంభిస్తున్నాయి. షియోమి తన Mi పే సేవను చైనాలో చాలా కాలం క్రితం ప్రారంభించింది. ఇప్పుడు వన్‌ప్లస్ సంస్థ కూడా వన్‌ప్లస్ పే సర్వీసును ప్రారంభించింది. భారతదేశంలో ఇతర బ్రాండ్లలో ఒప్పో సంస్థ ఒప్పో కాష్ తో మరియు రియల్మే సంస్థ రియల్మే పేసా డిజిటల్ చెల్లింపు సేవలను ప్రారంభించడం చూశాము. ఇప్పుడు ఈ లీగ్‌లోకి వన్‌ప్లస్ సంస్థ సరికొత్తగా వన్‌ప్లస్ పేతో ప్రవేశించింది. శామ్సంగ్ పే కూడా కొంతకాలం భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190