ఈ వన్‌ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్.. 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్..!
OnePlus Nord CE 4 lite 5G : వన్‌ప్లస్ నుంచి భారత్ మార్కెట్ లోకి జులై 8 వ తేదీన వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ లు విడుదల కానున్నాయి. వీటితోపాటు వన్‌ప్లస్ బడ్స్ 4 TWS ఇయర్‌బడ్స్ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్లు, బడ్స్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7100mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ల డిజైన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.
భారత్ మార్కెట్ లో వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం జూన్ లో విడుదల అయింది. ఈ ఫోన్ FHD+ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ను అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అల్ట్రా ఆరెంజ్, సూపర్ సిల్వర్ మెగా బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.

రూ.2000 డిస్కౌంట్ :
అమెజాన్ లో వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17997 గా ఉంది. మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ మోడల్ ను రూ.20997 గా ఉంది. ICICI, RBL కార్డులతో రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. రూ.20 వేల ధరలో 5G ఫోన్లను కొనుగోలు చేయాలని భావిస్తే ఈ ఫోన్‌ను పరిశీలించవచ్చు.
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ 80W వైర్ SUPERVOOC ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP LYT 600 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







