Home
Mobile

తొలిసారిగా 7100mAh భారీ బ్యాటరీతో Oneplus Nord CE 5 స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు, సేల్‌ వివరాలు..!

OnePlus Summer Launch Event 2025 : వన్‌ప్లస్‌ సమ్మర్‌ లాంచ్ ఈవెంట్ 2025 లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 5, నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 హ్యాండ్‌సెట్‌ ఏకంగా 7100mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ బ్యాటరీ ఎక్కువగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. రూ.25 వేల ధర రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Oneplus Nord CE 5 Smartphone) 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1400 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

OnePlus Nord CE 5 Smartphone

ఆండ్రాయిడ్ 15, మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అపెక్స్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR5x ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 600 కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP OVO8D10 అల్ట్రావైడ్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

OnePlus Nord CE 5 Smartphone

భారీ బ్యాటరీ ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 7100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IR బ్లాస్టర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ WiFi 6, బ్లూటూత్‌ 5.4 కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28999 గా ఉంది.

ఈ ఫోన్‌ సేల్‌ జులై 12 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌, అమెజాన్, ఇతర స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. నెక్సస్‌ బ్లూ, మార్బుల్‌ మిస్ట్‌, బ్లాస్‌ ఇన్ఫినిటీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్టుతో 6800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50MP + 8MP + 50MP (సెల్ఫీ) కెమెరాలను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. రేపటి నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 5 Smartphone launched in india with 7100mAh large battery, 50MP primary camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X