రూ. 15 వేలకే 16 ఎంపీ సెల్ఫీ, 3జీబి ర్యామ్‌తో ఒప్పో ఫోన్

Written By:

ఒప్పో నుంచి మరో సరికొత్త ఫోన్ దూసుకురానుంది. ఎ57 పేరుతో రానున్న ఈ ఫోన్ డిసెంబర్ 12న వినియోగదారులకు ముందుకు తీసుకురానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.15,840 రూపాయలకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫీచర్లు కూడా ఇతర ఫోన్లకు ధీటుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్ దిమ్మతిరిగే షాక్ తగిలింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

5.2 ఇంచ్ హెచ్డీ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతో పాటు1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

స్టోరేజ్

ఇక స్టోరేజ్ విషయానికొస్తే 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అదనపు ఆకర్షణలు

ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి.

ధర

ఫోన్ ధర విషయానికొస్తే రూ. 15,840లకు ఇది లభించే అవకాశం ఉంది. డిసెంబర్ 12న కంపెనీ అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OPPO A57 Smartphone with 3GB RAM & 16MP Selfie Camera Launched in China read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot