ఫ్లిప్‌కార్ట్ దిమ్మతిరిగే షాక్ తగిలింది

Written By:

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కు భారీ షాక్ తగిలింది. అమ్మకాల్లో పుంజుకున్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మార్కెట్ యూనిట్, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు డబుల్ నష్టాలను అంటే 110 శాతం మేర నష్టపోయింది. దేశంలో నంబర్ వన్ స్థానం కోసం పోరాడుతున్న కంపెనీ ఇలా నష్టాల్లో చిక్కుకోవడం కలచివేసే పరిణామమే.

2 రోజుల్లో ఎయిర్‌టెల్ దుమ్మురేపింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్ సుమారు రూ 2,306 కోట్ల నష్టాన్ని

2016 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఫ్లిప్‌కార్ట్ సుమారు రూ 2,306 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇది రూ 1,096 కోట్లగా ఉంది.

మార్కెట్ యూనిట్, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ భారీ నష్టాలను

దేశంలో నెంబర్ వన్ స్థానంకోసం మరో దిగ్గజ కంపెనీ అమెజాన్‌తో హోరాహోరీగా పోరాడుతున్న ఫ్లిప్‌కార్ట్‌కు మార్కెట్ యూనిట్, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ భారీ నష్టాలను అందించాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గత ఏడాది అమ్మకాల్లో 153 శాతం వృద్ధితో

బెంగుళూరు ఆధారిత ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ ప్రయివేట్ లిమిటెడ్ గత ఏడాది అమ్మకాల్లో 153 శాతం వృద్ధితో రూ .1952 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఆదాయ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ ఫ్లిప్ కార్ట్ మొత్తం వృద్ధి ఫ్లాట్ గానే ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు.

అక్టోబర్లో దీపావళి అమ్మకాలు

మరోవైపు అక్టోబర్లో దీపావళి అమ్మకాలు సమయంలో అమెజాన్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది ఫ్లిప్‌కార్ట్. అమెజాన్‌తో పోలిస్తే 0.5 మిలియన్ యూనిట్లను ఎక్కువగా విక్రయించింది.

ఫ్లిప్ కార్ట్ ఆర్థిక ఫలితాలు ఇంకా వెల్లడి

అయితే మొత్తంగా ఫ్లిప్ కార్ట్ ఆర్థిక ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. టాప్ మేనేజ్మెంట్ మార్పులు, సంస్థ నిర్మాణంలో సంస్కరణల నేపథ్యంలో లాభదాయకత పై దృష్టి కోల్పోతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. 

ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్

ఫ్లిప్ కార్ట్ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్, సింగపూర్ లో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Internet losses double to Rs 2,306 crore read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot