Home
Mobile

రూ.13999 కే 6000mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో OPPO 5G ఫోన్‌ విడుదల!

ఒప్పో నుంచి ఇటీవల K13 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఈ ఫోన్‌ 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే బడ్జెట్‌ రేంజ్‌లో తాజాగా కొత్త ఫోన్‌ను ఒప్పో విడుదల చేసింది. ఒప్పో A5x 5G పేరుతో లాంచ్‌ అయింది. గత సంవత్సరం విడుదల అయిన ఒప్పో A3x 5G మోడల్‌కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఒప్పో కొత్త ఫోన్ ఎక్కువ రోజుల మన్నిక వచ్చేలా ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది.

ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (OPPO A5x 5G Smartphone) 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ MIL STD షాక్ రెసిస్టెన్స్‌, SGS గోల్డ్‌ సర్టిఫికేషన్‌ లను కలిగి ఉన్నాయి.

OPPO A5x 5G Smartphone Launched with 6000mAh battery and mediatek dimensity 6300 chip in india

చిప్‌సెట్‌ వివరాలు :
ఒప్పో ఫోన్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు వర్చువల్‌గా 4GB ర్యామ్‌ను అదనంగా పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు :
మెరుగైన పనితీరు కోసం ఈ ఫోన్‌ ట్రినిటీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ AI అన్‌బ్లర్‌, AI Eraser 2.0, AI Clarity Enhancer, Reflection Remover, AI స్మార్ట్‌ ఇమేజ్‌ మ్యాటింగ్‌ 2.0 వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌, ఆటోఫోకస్ సపోర్టుతో 32MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 5 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుందని సంస్థ చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G, బ్లూటూత్‌ 5.1, వైఫై 5, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే స్ప్లాష్‌ టచ్‌, గ్లౌజ్‌ టచ్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. మే 25 వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఒప్పో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, లేజర్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ను SBI, IDFC ఫస్ట్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, DBS బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంక్‌ ల కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. దీంతోపాటు 3 నెలల వరకు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO A5x 5G Smartphone Launched with 6000mAh battery and mediatek dimensity 6300 chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X