Home
Mobile

నీటిలో తడిచినా డ్యామేజీ కానీ, 6500mAh బ్యాటరీ కలిగిన 5G ఫోన్‌ సేల్‌.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!

ఒప్పో F29 5G సిరీస్‌ ఇటీవల భారత్‌ మార్కెట్లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో ఒప్పో F29 5G, F29 ప్రో 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో F29 5G హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఇవాళ అర్ధరాత్రి (మార్చి 27 12AM) నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ఒప్పో f29 5G స్మార్ట్‌ఫోన్‌ 360 డిగ్రీల ఆర్మర్‌ బాడీ ని కలిగి ఉంది. మరియు IP69 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలోనూ పనిచేస్తుంది. దీంతోపాటు మిలిటరీ గ్రేట్‌ MIL STD 810H 2022 డ్రాప్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

Oppo F29 5g Smartphone sale

ఒప్పో f29 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ :
ఒప్పో f29 5G స్మార్ట్‌ఫోన్‌ (Oppo F29 5g Smartphone Sale) ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది. ఒప్పో ఇండియా, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. SBI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ ఫోన్ రూ.2000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను అందిస్తుంది. మరియు 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI సదుపాయం అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6 నెలల వరకు లిక్విడ్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ సోలిడ్‌ పర్పుల్‌, గ్లేసియల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఒప్పో f29 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో f29 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15.0 తో పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని ఒప్పో హామీ ఇచ్చింది.

ఈ ఒప్పో ఫోన్ 6.7 అంగుళాల (1080*2412 పిక్సల్స్‌) FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i రక్షణను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. 50MP శాంసంగ్‌ JN5 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా EIS (ఎలక్ట్రానిక్స్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ కెమెరాలతో 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ కెమెరా యూనిట్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. AI Photoshhot, AI Unblur, AI Eraser 2.0 ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. వీటితోపాటు AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్‌ యాంటెనాను అమర్చారు. మెరుగైన నెట్‌వర్క్‌ను అందిస్తుంది.

45W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఒప్పో F29 5G సిరీస్ 5G, 4G LTE, GPS, OTG, USB-C, బ్లూటూత్‌, వైఫై 6, ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo F29 5g Smartphone sale to start today midnight on amazon and flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X