ఒప్పో నుంచి F5 Youth, 16 ఎంపీ సెల్ఫీ, 6 ఇంచ్ భారీ డిస్‌ప్లే
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎఫ్5 యూత్'ను మార్కెట్లోకి విడుదల చేసింది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎఫ్5 యూత్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.17,750 నిర్ణయించింది. అయితే ఇది ఫిలప్ఫీన్స్ లో మాత్రమే విడుదలయింది. ఇండియాకి ఎప్పుడు అనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
బెజెల్ లెస్ డిస్‌ప్లే ద్వారా ఫుల్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ యూజర్లకు కలుగుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఫోన్‌లో డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్‌ను ఇచ్చారు. దీని వల్ల ఏక కాలంలో రెండు సిమ్ కార్డులతోపాటు ఒక మెమొరీ కార్డును కూడా యూజర్లు వేసుకుని వాడవచ్చు.
ఈ ఫోన్‌ని 700 సార్లు సోప్ పెట్టి కడిగినా చెక్కు చెదరలేదు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








