200MP టెలిఫోటో కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
ఒప్పో ఫైండ్ X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయ్యాయి. ఇందులో ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో మోడల్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్‌తోపాటు ప్రో మోడల్ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. అయితే ప్రో మోడల్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోన్ (OPPO Find X9 Pro Smartphone) 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 3600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 450 PPI పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఒప్పో హామీ ఇచ్చింది.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-828 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ ISOCELL 5KJN5 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ మరియు OIS సపోర్టుతో 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP శాంసంగ్ 5KJN5 కెమెరాతో అందుబాటులో ఉంది.

7500mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 80W SuperVOOC వైర్ ఛార్జింగ్, 50W AirVOOC వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 36,344.5 Sq mm తో కూడిన VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
వైఫై 7 :
కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై 7, బ్లూటూత్ 6.0, NFC, AI లింక్‌బూస్ట్, ఒప్పో RF చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. SGS డ్రాప్ రెసిస్టెంట్‌గా ఉంది.
The wait is over.
— OPPO India (@OPPOIndia) November 18, 2025
Your First Hasselblad Camera phone is finally here!#OPPOFindX9Series starts at ₹74,999 for the Find X9 and ₹1,09,999 for the Find X9 Pro.
Grab it now with exciting Pre-Order offers!#AIFlagshipCamera #HasselbladPocketCamera pic.twitter.com/hP5zoF9Xxr
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ మోడల్ ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,09,999 గా ఉంది. ఈ ఫోన్ టైటానియం చార్‌కోల్, సిల్క్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








