రూ.12499 ధరకు 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కిందపడినా డ్యామేజీ కాని 5G స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో ఈ నెలలో భారత్ మార్కెట్‌లో ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14999 గా ఉంది. అయితే బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన ఒప్పో k13x 5G స్మార్ట్‌ఫోన్‌ను సుమారుగా రూ.12 వేల ధర రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కిందపడినా డ్యామేజీ కాకుండా ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ (OPPO K13x 5G Smartphone) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్, బ్రీజ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్, 360 డిగ్రీల ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు Sponge Absorption ఫీచర్ కూడా ఉంది.
ఏదైనా సందర్భంలో పొరపాటున స్మార్ట్‌ఫోన్ కిందపడినా ఈ ఫీచర్ కారణంగా ఫోన్‌లోని అంతర్గత భాగాలు డ్యామేజీ కాకుండా రక్షణ కల్పిస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.

తడి చేతులతోనూ :
ఒప్పో హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు స్ల్పాష్, గ్లౌజ్ టచ్ ఫీచర్ కూడా ఉంది. ఫలితంగా తడిచేతులతోనూ ఈ ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
ఒప్పో ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ అనేక AI ఫీచర్లను కలిగి ఉంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.


Click it and Unblock the Notifications








