12GB ర్యామ్, నాలుగు 50MP కెమెరాలు, 6.83 అంగుళాల భారీ డిస్‌ప్లేతో OPPO Reno 14 Pro 5G స్మార్ట్‌ఫోన్..!
OPPO Reno 14 Pro 5G Smartphone : భారత్ మార్కెట్‌లో ఒప్పో రెనో 14 5G సిరీస్ ఇవాళ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 14 5G, రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ప్రో మోడల్ భారీ బ్యాటరీ సహా మెరుగైన కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. ఈ ప్రో మోడల్ ప్రీమియం డిజైన్‌తోపాటు IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ప్రీమియం డిజైన్, గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ గూగుల్ జెమినీ, AI Unblur, AI Call Assistant, AI Mind Space, AI Recompose వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
నాలుగు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP సోనీ OV50E ప్రైమరీ కెమెరా, 116 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP OV50D అల్ట్రావైడ్ లెన్స్ మరియు OIS, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

6200mAh బ్యాటరీ :
ఈ ప్రో మోడల్ 80W వైర్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 5 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా eSIM, 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ పెర్ల్ వైట్, టైటానియం గ్రే కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.

ఒప్పో రెనో 14 ప్రో 5G ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ జులై 8 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా, అమెజాన్ తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








