గూగుల్ పిక్సల్ vs ఐఫోన్ 7 vs శాంసంగ్ గెలాక్సి S7 : ఏది బెస్ట్ ?

By Hazarath
|

గూగుల్ తన తొలితరం ఫోన్ గూగుల్ పిక్సల్‌ను గత రాత్రి లాంచ్ చేసిన విషయం విదితమే. గూగుల్ నుంచి వచ్చిన ప్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త ఫీచర్లను జోడించి మార్కెట్‌లోకి వదిలింది. అన్ లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజితో వచ్చిన ఈ ఫోన్లు ఐఫోన్ 7కి పోటీనిస్తుందని కంపెనీ భావిస్తోంది. అయితే నిజంగానే పోటీనిస్తుందా.. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S7 తో ఐఫోన్ 7 వార్ నడుస్తున్న నేపధ్యంలో వీటికి గూగుల్ పిక్సల్ తోడయింది. మరి పోటినిస్తుందా..ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

టార్గెట్ రూ.5 లక్షల కోట్లు: వచ్చింది రూ.60 వేల కోట్లు

ధర

ధర

ఈ నెల్లో గూగుల్ పిక్సల్ ఇండియాలో అమ్మకానికి రానున్నాయి.అక్టోబర్ 13 నుంచి ఫ్రీ ఆర్డర్స్ ఉంటాయని కంపెనీ చెబుతోంది. పిక్సల్ రెండు రకాల వేరియంట్లలో లభిస్తోంది. 32 జిబి ధర రూ. 57,000,128 జిబి ధర రూ. 66,000గా కంపెనీ నిర్ణయించింది. ఐపోన్ 7 ఈ వారంలో ఇండియాలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 62 జిబి ధర రూ. 60,000 అలాగే 128 జిబి రూ.70,000, 256 జిబి ధర రూ. 80,000గా కంపెనీ నిర్ణయించింది. శాంసంగ్ గెలాక్సి S7 ఇప్పటికే ఇండియాలో అమ్మకాలు ప్రారంభించింది. ఇది. రూ. 43,400కు లభ్యమవుతోంది.

డిస్ ప్లే

డిస్ ప్లే

మూడు రకాల ఫోన్లు వివిధ రకాల స్క్రీన్ సైజుల్లో వచ్చాయి. ఫిక్సల్ 5 ఇంచ్ పుల్ HD (1080p) అమోల్డ్ డిస్ ప్లే తో పాటు కొర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ తో వచ్చింది. గెలాక్సి ఎస్7 5.1 ఇంచ్ QHD Super AMOLED displayతో పాటు కొర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ తో వచ్చింది. ఐఫోన్ 7 విషయానికొస్తే 4.7 ఇంచ్ పుల్ HD (1080p) Retina HD displayతో తీసుకొచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాసెసర్
 

ప్రాసెసర్

గూగుల్ నుంచి వచ్చిన పిక్సల్ ఫోన్ Qualcomm's latest Snapdragon 821 quad-core chipset clocked at 2.15GHzతో వచ్చింది. శాంసంగ్ లో సైతం Snapdragon 820 clocked at 2.15GHz తో పాటు Qualcomm chipsetని పొందుపరిచారు. ఆపిల్ ఐఫోన్ 7 మాత్రం A10 Fusion chipsetతో వచ్చింది. ఈ ప్రాసెసర్ గత ఐ ఫోన్ల కన్నా 40 శాతం ఎక్కువ స్పీడ్ తో రన్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

ర్యామ్

ర్యామ్

ఇక ర్యామ్ విషయానికొస్తే గూగుల్ నుంచి వచ్చిన పిక్సల్ 4జిబి ర్యామ్ తో రాగా, శాంసంగ్ గెలాక్సి ఎస్7 కూడా 4జిబి ర్యామ్ తోనే వచ్చింది. ఇక ఆపిల్ నుంచి వచ్చిన ఐఫోన్ 7 కేవలం 2జిబి ర్యామ్ తో వచ్చింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టోరేజి

స్టోరేజి

మూడు రకాల కంపెనీ ఫోన్లు 32 జిబి ఇంటర్నల్ మెమొరీతో వచ్చాయి. అయితే వీటిల్లో గూగుల్ ఫిక్సల్ ఫోన్ 128 జిబిని ఆఫర్ చేస్తుండగా ఐఫోన్7 128 జిబిని అలాగే 256 జిబిని ఆఫర్ చేస్తున్నాయి. గెలాక్సి ఎస్7 మాత్రం 32 జిబితోనే ఆగిపోయింది. పిక్సల్ కు అలాగే ఐఫోన్ 7కు మైక్రో ఎస్ డి కార్డు ద్వారా మెమొరీ విస్తరించుకునే అవకాశం ఉంది. అయితే శాంసంగ్ గెలాక్సి ఎస్7కు ఆ అవకాశం లేదు.

ఫోటోగ్రపి

ఫోటోగ్రపి

శాంసంగ్ గెలాక్సి ఎస్ 7 12 మెగా ఫిక్సల్ స్నాపర్ f/1.7 aperture తో వచ్చింది. డ్యూయెల్ ఫిక్సల్ టెక్నాలజీతో లాంచ్ టైంలో అన్ని స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ కెమెరా ఫోన్‌గా నిలిచింది. ఇక ఆపిల్ ఐఫోన్ 7 కూడా 12 మెగా ఫిక్సల్ స్నాపర్ /1.8 apertureతో వచ్చింది. PDAF, OIS and quad-LED dual-tone flash వంటి ఫీచర్లతో వచ్చింది. అయితే గూగుల్ నుంచి వచ్చిన పిక్సల్ ఫోన్లు 12.3 మెగా పిక్సల్ స్నాపర్ f/1.7 apertureతో వచ్చింది. బెస్ట్ కెమెరా ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 1.55µm పిక్సల్ సైజ్ తో పాటు 4కె వీడియో షూట్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెల్ఫీ షూటర్

సెల్ఫీ షూటర్

సెల్ఫీ లవర్ల కోసం గూగుల్ పిక్సల్ పోన్ 8 మెగా ఫిక్సల్ f/2.4 apertureతో వచ్చింది. అదే ఐఫోన్ 7 అయితే 7 మెగా ఫిక్సల్‌తో దూసుకొచ్చింది. ఇక గెలాక్సీ ఎస్7 5 మెగా పిక్సల్ సెల్పీ స్నాపర్‌తో వచ్చింది.

బ్యాటరీ

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే గెలాక్సీ 7దే సింహభాగం. 3000 mAh బ్యాటరీతో వచ్చింది. వైర్ లెస్ ఛార్జింగ్ తో పాటు క్విక్ చార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. గూగుల్ నుంచి వచ్చిన పిక్సల్ ఫోన్ 2,770mAh బ్యాటరీతో వచ్చింది. 26 గంటల పాటు మాట్లాడుకోవచ్చని అలాగే స్టాండ్ బై టైం 19 రోజులని కంపెనీ చెబుతోంది. 15 నిమిషాల ఛార్జింగ్ తో 7 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని చెబుతోంది. ఇక ఐఫోన్ 7 1,960mAh బ్యాటరీతో వచ్చింది. అయితే హార్డ్ వేర్ సాప్ట్ వేర్ కండీషన్ మంచిగా ఉండటం వల్ల సింగిల్ చార్జ్ చాలని ఆపిల్ కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్కానర్

స్కానర్

అన్ని ఫోన్లు పింగర్ ప్రింట్ స్కానర్‌తో వచ్చాయి. ఫిక్సల్‌కు వెనుక భాగంలో స్కానర్ ఉంటే గెలాక్సి ఎస్7కు, ఐఫోన్7కు ముందు భాగంలోని హోమ్ బటన్‌లో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సి ఎస్7లో ప్లస్ పాయింట్ ఏంటంట్ హార్ట్ రేట్ మానిటర్‌ని వెనుక కెమెరాతో చెక్ చేసుకోవచ్చు. గెలాక్సి ఎస్7, ఐఫోన్7 వేరియంట్లు మాత్రమే water and dust రెసిస్టెంట్ తో వచ్చాయి. పిక్సల్ కు ఆ ఫీచర్ లేదు.

కనెక్టివిటి

కనెక్టివిటి

మూడు రకాల కంపెనీ వేరియంట్లు 4G LTE తో వచ్చాయి. NFC ని సపోర్ట్ చేస్తాయి. అయితే వీటిల్లో గెలాక్సి ఎస్ 7 మాత్రమే డ్యూయల్ సిమ్ తో వచ్చింది మిగతా ఫోన్లు సింగిల్ సిమ్ తో వచ్చాయి. అయితే ఐఫోన్ 7 మాత్రం 3.5mm audio jackతో వచ్చింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాప్ట్‌వేర్

సాప్ట్‌వేర్

ఆపిల్ ఐఫోన్ 7 ఆండ్రాయిడ్ పోన్లకు పూర్తిగా ఢిపరెంట్. iOS ఫ్లాట్ పాం మీద వచ్చింది. గెలాక్సి ఎస్ 7 ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో తో వచ్చింది. అలాగే ఆండ్రాయిడ్ నౌగట్ కి అప్ డేట్ ఉంది. పిక్సల్ మాత్రం నౌగట్ తో దూసుకొచ్చింది.అయితే గూగుల్ పిక్సల్ లో గూగుల్ అసిస్టెంట్ ని కొత్తగా తీసుకొచ్చారు. దీని ద్వారా మీరు గూగుల్ ప్రొడక్ట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఏది బెస్ట్

ఏది బెస్ట్

మూడు రకాల కంపెనీ ఫోన్లు గట్టి ఫీచర్ తో వచ్చాయి. ఏది బెస్ట్ అనేది కష్టమర్ సెలక్ట్ చేసుకునే బ్రాండ్ మీద ఆధారపడిఉంటుంది. ఆపిల్, శాంసంగ్‌లు ఇప్పటికే కష్టమర్ల మనసు దోచుకున్న నేపథ్యంలో గూగుల్ ఫిక్సల్ కూడా కష్టమర్ల మనసు దోచుకుంటుందనే ఆశించాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Google Pixel vs Apple iPhone 7 vs Samsung Galaxy S7: Price, specifications, features compared Read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X