టార్గెట్ రూ.5 లక్షల కోట్లు: వచ్చింది రూ.60 వేల కోట్లు

Written By:

రేడియో తరంగాల ద్వారా రూ. 5 లక్షల కోట్లను సేకరించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశయం నెరవేరేలా లేదు. దేశంలో వాడకుండా మిగిలివున్న వివిధ బ్యాండ్లలోని రేడియో తరంగాలను విక్రయించడం ద్వారా కనీసం రూ. 5 లక్షల కోట్లను ఖజానాకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమై మూడు రోజులు దాటుతున్నా ఇంకా 60 శాతం మేర తరంగాలకు ఒక బిడ్ కూడా దాఖలు కాలేదు.

మెసేంజర్‌లోకి సరికొత్త ఫీచర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

17 రౌండ్ల వేలం ముగిసినా

మొత్తం మీద ఇప్పటివరకూ రూ. 60,969 కోట్ల ఆఫర్ లభించింది. టెలికం కంపెనీల్లో రుణ భారం పెరగడం, 700, 900 మెగాహెర్జ్ బ్యాండ్లపై తరంగాలకు ధర అధికంగా నిర్ణయించడంతో 17 రౌండ్ల వేలం ముగిసినా అనుకున్నంత ధర రాలేదు.

మంగళవారం నాటికి

తొలి రోజైన శనివారం దాదాపు రూ.51,000 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలు చేసిన కంపెనీలు మూడో రోజైన మంగళవారం నాటికి మరో రూ.10,000 కోట్ల విలువైన బిడ్స్‌ మాత్రమే దాఖలు చేశాయి.

మొత్తం బిడ్స్‌ విలువ

దీంతో మొత్తం బిడ్స్‌ విలువ రూ.60,969 కోట్లకు చేరింది. 2354.44 మెగాహెర్జ్ తరంగాలు మాత్రం 100 శాతం అమ్ముడుపోయాయి.

కీలకమైన 700 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌కు

ప్రభుత్వానికి కాసులు కురిపిస్తాయనుకున్న కీలకమైన 700 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌కు ఇప్పటి వరకు ఒక్క బిడ్‌ కూడా రాలేదు. 900 మెగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌కు మాత్రం ఒకటి రెండు బిడ్లు వచ్చాయి. మరో ఒకటి రెండు రోజుల్లో వేలం ముగియబోతోంది.

రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లు వరకు

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లు వరకు ఖజానాకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ మొత్తం బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పిన రూ. 98,995 కోట్లతో పోలిస్తే నాలుగో వంతు మాత్రమే కావడం గమనార్హం.

1800 మెగాహెర్జ్ తరంగాలకు

ముంబై సర్కిల్ లో మాత్రమే 1800 మెగాహెర్జ్ తరంగాలకు బిడ్డింగ్ బుధవారం 18వ రౌండ్ లోకి ప్రవేశించింది. ముంబై, మహారాష్ట్ర సర్కిళ్లలో కొంత స్పెక్ట్రమ్ తమకు అవసరమని భావిస్తున్న టాటా టెలీ సర్వీసెస్ పోటీకి దిగింది.

రెండు రోజుల వ్యవధిలో

దీంతో రెండు రోజుల వ్యవధిలో తరంగాల ధర 39 శాతం పెరిగింది. యూపీలోనూ స్పెక్ట్రమ్ కోసం టెలికం కంపెనీలు గట్టిగానే పోరాడుతున్నాయి.

రిలయన్స్ జియో రూ. 16 వేల కోట్లు

టెలికం పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం, వోడాఫోన్ రూ. 17 వేల కోట్లు, రిలయన్స్ జియో రూ. 16 వేల కోట్లు, ఐడియా సెల్యులార్ రూ. 15 వేల కోట్లు, ఎయిర్ టెల్ రూ. 13 వేల కోట్ల విలువైన తరంగాలను దక్కించుకోనున్నాయని సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Spectrum auction gets bids worth Rs 60,969 crore, but 60% airwaves still remain unsold read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting