Home
Mobile

ధర రూ.9999 కే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, 5160mAh బ్యాటరీ 5G ఫోన్‌..!

పోకో నుంచి తాజాగా భారత్ మార్కెట్‌లో పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco M7 5G Launched) విడుదల అయింది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా.. సూపర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. భారీ డిస్‌ప్లేతోపాటు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ సహా ఆకట్టుకొనే డిజైన్‌తో విడుదల అయింది. ఫ్లిప్‌కార్ట్‌ ‌ద్వారా ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఫోన్ కొనుగోలుపై రూ.500 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
పోకో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ను ఎక్కువ సమయం వినియోగించినా.. కళ్లపై ఒత్తిడి లేకుండా చూసేందుకు ట్రిపుల్‌ TUV సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

Poco M7 5G smartphone sale

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ పోకో ఎంట్రీ లెవల్‌ 5G స్మార్ట్‌ఫోన్ అండర్‌ ది హుడ్‌ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 8GB ర్యామ్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ ద్వారా గరిష్ఠంగా 12GB వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది.

రెండు స్టోరేజీ వేరియంట్‌లు :
ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.

సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ పోకో 5G ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. నాచ్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది.

భారీ బ్యాటరీ :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

Poco M7 5G smartphone sale

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు
ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. మార్చి 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. సేల్‌ తొలిరోజు ఈ రెండు వేరియంట్‌ను రూ.500 చొప్పున డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఫలితంగా పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ.9,999, రూ.10,499 గా ఉంటాయి. ఈ ఫోన్‌ శాటిన్‌ బ్లాక్‌, మింట్‌ గ్రీన్‌, ఓసియన్‌ బ్లూ వంటి మూడు రంగుల్లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 5G smartphone launched with 6.88 inch display and snapdragon 4 Gen 2 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X