రూ.10,000 ధరలో బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా.. 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లే ఫోన్‌పై లుక్కేయండి..!
భారత్ మార్కెట్‌లో పోకో నుంచి ఇటీవల పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ రూ.10 వేల ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ ధరలోనే సూపర్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఆకట్టుకొనే డిజైన్‌తో ఏకంగా 6.88 అంగుళాల డిస్‌ప్లే, సోనీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు.
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ ధర :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ (Poco M7 5G Smartphone Sale) ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపును పొందవచ్చు.

డిస్కౌంట్ ఆఫర్లు :
ఫలితంగా 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు. మరియు 8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
పోకో M7 5G హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఎక్కువ సమయం వినియోగించినా కళ్లపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసేందుకు TUV లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ప్రీ సర్టిఫైడ్ వంటి TUV సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 (అండర్ ది హుడ్) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. 6GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు.
4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కోసం 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని పోకో సంస్థ హామీ ఇచ్చింది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
పోకో 5G ఫోన్ రూ.10,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయినా మెరుగైన కెమెరాలను అందించింది. ఈ హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను అమర్చారు. దీంతోపాటు ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై సహా USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్ శాటిన్ బ్లాక్, మింట్ గ్రీన్, ఓసియన్ బ్లూ రంగుల్లో లభిస్తోంది.


Click it and Unblock the Notifications








