రెడ్‌మి నోట్ 5 ఫీచర్లు ఇవే..

రెడ్‌మి నోట్ 4కు సక్సెసర్ వర్షన్‌గా షియోమి లాంచ్ చేయబోతోన్న రెడ్‌మి నోట్ 5, నోట్ 5ఏ స్మార్ట్‌ఫోన్‌లు ఆగష్టు లేదా సెప్టంబర్‌లో మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్‌లకు సంబంధించిన స్పెసిషికేషన్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి...

Read More : ఆగష్టు 24 నుంచి జియోఫోన్ బుకింగ్స్, మీకూ రిమైండర్ కావాలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Redmi Note 5 రూమర్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌‌ప్లే (రిసల్యూషన్1080× 1920పిక్సల్స్) విత్ ఫుల్ హైడెఫినిషన్ ప్యానల్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 చిప్‌సెట్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3790mAh బ్యాటరీ.

Redmi Note 5A రూమర్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్, డ్యుయల్ కెమెరా సెటప్ (12 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 790mAh బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో Redmi Note 5, Note 5A స్మార్ట్‌ఫోన్‌లను 2018 ఆరంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.

రెడ్‌మి నోట్ 5 కూడా బంపర్ హిట్టే..

స్పెసిఫికేషన్స్ పరంగా రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి నోట్ 4 బాటలోనే రెడ్‌మి నోట్ 5 కూడా బంపర్ హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం రెడ్‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ఈ విధమైన ఫీచర్లతో రాబోతోంది.

టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000లోపు..

మార్కెట్లో Redmi Note 5 టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000 వరకు ఉండొచ్చని సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Purported Specifications of the Xiaomi Redmi Note 5 and Redmi Note 5A Surfaced Online. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot