Home
Mobile

రక్షాబంధన్ కానుకగా ఇవ్వడానికి బెస్ట్ స్మార్ట్ ఫోన్లు,రూ.10000 ల లోపు. 

By Maheswara

స్మార్ట్ఫోన్లు అనేక సందర్భాల్లో బహుమతులు గా ఇవ్వడానికి వీలుగా ఉంటాయి. భారతదేశంలో, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి ఏర్పరచిన పండగలు ,సందర్భాలలో రక్షా బంధన్ ఒకటి. 2020 సంవత్సరానికి గాను రక్షా బంధన్ త్వరలో రాబోతున్న సందర్భంగా, మీ సోదరి కోసం ఈ రోజు మార్కెట్లో ఎంచుకోవడానికి చాలా ఎంపికలు ఉన్నాయి.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు

వీటిలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు రూ. 10,000.లలో  రియల్‌మీ , షియోమి, మోటరోలా, ఇన్ఫినిక్స్, శామ్‌సంగ్,  వంటి బ్రాండ్ల నుండి ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం రండి.

Realme Narzo 10A

Realme Narzo 10A

Realme Narzo 10A 
MRP: Rs. 8,999
రియల్‌మి నార్జో 10A స్పెసిఫికేషన్స్
రియల్‌మి 10A స్మార్ట్ ఫోన్ యొక్క 6.5-అంగుళాల డిస్ప్లే హెచ్‌డి + రిజల్యూషన్ తో 720x1600 పిక్సెల్స్ పరిమాణంతో మరియు 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.ఇక కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో f / 1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా 119 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి.3GB ర్యామ్,32GB మెమరీ మరియు 5000mah బ్యాటరీ కలిగి ఉంటుంది 

Xiaomi Redmi 8A

Xiaomi Redmi 8A

Xiaomi Redmi 8A
MRP: Rs. 7,397
రెడ్‌మి 8A స్మార్ట్‌ఫోన్‌ 6.22-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను 720 × 1520 పిక్సెల్ రిజల్యూషన్,19: 9  నిష్పత్తితో మరియు 271ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది.
ఇది ఓషన్ బ్లూ, రెడ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌తో కూడిన మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.రెడ్‌మి 8A 1.95 GHz, క్వాడ్-కోర్ కార్టెక్స్ A53 కోర్ 1.45 GHz, క్వాడ్-కోర్ కార్టెక్స్ A53 తో కలిపి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC తో వస్తుంది.2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో SD కార్డ్ ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీతో వస్తుంది.

Moto G8 Power Lite

Moto G8 Power Lite

Moto G8 Power Lite
MRP: Rs. 9,499 
6.5-ఇంచ్ (1600×720 పిక్సల్స్) HD+ 20:9  తో LCD స్క్రీన్, మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది.అలాగే ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో మరియు 5,000mah బ్యాటరీతో వస్తోంది. 4GB ర్యామ్ తో పాటు స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది.

Infinix Hot 9

Infinix Hot 9

Infinix Hot 9
MRP: Rs. 9,499

6.6-అంగుళాల హెచ్‌డి + హోల్-పంచ్ LCD IPS డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తి, 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియో, మరియు 480 నిట్స్ ప్రకాశంతో వస్తాయి. IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAM తో జత చేసిన 2.0GH హెలియో పి 22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో ఇవి పనిచేస్తాయి. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB మరియు ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.ఇన్ఫినిక్స్ హాట్ 9 లో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది.5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో  ఇది 30 గంటల టాక్‌టైమ్ లేదా 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యం తో వస్తుంది.

Realme C3

Realme C3

Realme C3
MRP: Rs. 7,954

రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్‌ 20: 9 కారక నిష్పత్తితో మరియు 89.8 శాతం స్క్రీన్-బాడీ-రేషియో గల 6.5-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది.ఇది మీడియాటెక్ హెలియో G70 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది.ఇంటర్నల్ స్టోరేజ్ 64GB మరియు మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. అలాగే పోర్ట్రెయిట్‌ల మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి.ఈ ‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో ఉండి ,ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది.

Samsung Galaxy A10

Samsung Galaxy A10

Samsung Galaxy A10
MRP: Rs. 7,990

Exynos 7884B processorతో పాటు 2జిబి ర్యామ్ 32 జిబి ఇంటర్నల్ మెమొరీతో వస్తుంది. అయితే ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదని తెలుస్తోంది. కేవలం ఫేస్ అన్ లాక్ ఫీచర్ మాత్రమే కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. డ్యూయెల్ సిమ్ అలాగే మైక్రో ఎస్ డి కార్డు, 3400mAh battery, microUSB port వంటి ఫీచర్లు తో వస్తాయి. 13MP మెయిన్ కెమెరాతో వస్తుంది.బ్లాక్ ,గోల్డ్ రంగుల్లో లభ్యమవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Raksha Bandhan Gift Ideas 2020: Budget Smartphones under rs10000 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X