తక్కువ ధరలో 7000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి భారత్ మార్కెట్లో ఈ సంవత్సరం జులై నెలలో రియల్‌మి 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో 15 5G, రియల్‌మి 15 ప్రో 5G మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే సిరీస్‌ను సెప్టెంబర్ నెలలో రియల్‌మి 15T 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ సహా అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.
ఎప్పుడు విడుదల కానుంది? :
రియల్‌మి 15 సిరీస్ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. రియల్‌మి 15x 5G (Realme 15x 5G Smartphone Launch Date) పేరుతో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ అక్టోబర్ 1 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు రియల్‌మి తెలిపింది. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

ఎంత ధరలో అందుబాటులోకి వస్తుంది? :
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ డిజైన్‌తోపాటు బ్యాటరీ, కెమెరా సహా ర్యామ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు వెల్లడి కాకపోయినా.. రూ.15 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్, IP69 రేటింగ్ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. మరియు IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ కానుంది. ఫలితంగా పొరపాటున కింద పడినా, నీటిలో పడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది.
ట్రిపుల్ కెమెరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు Aura రింగ్ లైట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా తక్కువ వెలుగులోనూ మెరుగైన ఫోటోలు క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ముందువైపు పంచ్ హోల్ డిజైన్‌లో సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుంది.
50MP + 50MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు 50MP AI ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మిగిలిన రెండు కెమెరా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని వెల్లడయింది.
7000mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ డిస్‌ప్లే వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.
ఈ ఫోన్ చిప్‌సెట్ వివరాలు వెల్లడి కాలేదు. 6nm ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్ఠంగా 24GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. మరియు ఈ ఫోన్ 256GB స్టోరేజీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications