Home
Mobile

రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ల సేల్‌ ఆఫర్‌లు వెల్లడి.. విద్యార్థులకు రూ.1299 విలువైన ప్రయోజనాలు..!

రియల్‌మి నార్జో 80 సిరీస్‌ (Realme Narzo 80 5G Series) భారత్ మార్కెట్‌ లో ఏప్రిల్‌ 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నార్జో 80 ప్రో 5G, నార్జో 80x 5G హ్యాండ్‌సెట్స్‌ లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఫోన్‌ల చిప్‌సెట్‌ సహా అనేక వివరాలు వెల్లడయ్యారు. తాజాగా ఈ సిరీస్‌ ఎర్లీ బర్డ్‌ మరియు లిమిటెడ్ పిరియడ్‌ సేల్‌, స్టూడెంట్ బెనిఫిట్‌ వివరాలను వెల్లడించింది.

రియల్‌మి నార్జో 80 సిరీస్‌ ఎర్లీ బర్డ్‌ సేల్‌ ఏప్రిల్‌ 9 సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించనున్నారు. ఈ సేల్‌ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ realme.com, ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌ ద్వారా జరగనుంది. దీంతోపాటు లిమిటెడ్‌ సేల్‌ తేదీ, ఆఫర్లను కూడా వెల్లడించింది.

Realme narzo 80 series

రియల్‌మి నార్జో 80 సిరీస్‌ లిమిటెడ్‌ సేల్‌లో తేదీ ఏప్రిల్‌ 11 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించనున్నారు. దీంతోపాటు ఎక్లూజివ్‌ స్టూడెంట్‌ బెనిఫిట్‌ కూడా ప్రకటన చేసింది. రియల్‌మి నార్జో 80 ప్రో 5G, నార్జో 80x 5G ఫోన్‌ల తొలి సేల్‌ సమయంలో విద్యార్థులు వారి ఐడీ కార్డులను వెరిఫై చేసుకొని రూ.1299 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

విద్యార్థులు సంవత్సరం వరకు స్క్రీన్‌ డ్యామేజీ ప్రొటెక్షన్‌ను పొందవచ్చు. ఇందుకు ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్‌ కేవలం ఏప్రిల్‌ 9 నుంచి ఏప్రిల్‌ 18 తేదీల మధ్య కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

అయితే ఏప్రిల్‌ 28 వ తేదీ లోగా విద్యార్థులు తమ ఐడీ కార్డులను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం మే 8 న స్క్రీన్ డ్యామేజీ ప్రొటెక్షన్‌ పొందుతారు. అమెజాన్, రియల్‌మి వెబ్‌సైట్‌ ద్వారా ఈ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.20 వేల ధరలో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. భారీ బ్యాటరీని కలిగి ఉంటున్నా.. ఈ సెగ్మెంట్‌లోనే స్లిమ్‌ ఫోన్‌గా ఉండనుంది.

ఈ ప్రో మోడల్‌ (Realme Narzo 80 Pro 5G) థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 6050mm2 VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ కానుందని రియల్‌మి తెలిపింది.

ఈ వారంలో విడుదల కానున్న ఒక స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకత ఉంది.. మీకు తెలుసా?

రియల్‌మి నార్జో 80x 5G (Realme Narzo 80x 5G) స్మార్ట్‌ఫోన్‌ రూ.13000 ధర సెగ్మెంట్‌లో భారత్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ eye కంఫర్ట్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme narzo 80 series smartphones early bird sale, limited sale and student benefits revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X