Home
Mobile

రియల్‌మి P3 సిరీస్‌ నుంచి అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌.. కీలక వివరాలు షేర్‌ చేసిన సంస్థ..!

రియల్‌మి నుంచి గత నెలలో రియల్‌మి P3 సిరీస్‌ (Realme P3 Series) విడుదల అయింది. ఈ సిరిస్‌లో భాగంగా P3 ప్రో 5G, P3x 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. రియల్‌మి P3 అల్ట్రా పేరుతో లాంచ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రియల్‌మి తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది.

రియల్‌మి తన X హ్యాండిల్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన ఫోటోను (Realme P3 Ultra 5G smartphone) విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను వెల్లడించలేదు. అయితే ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను విడుదల చేయలేదు.

Realme P3 Ultra 5G smartphone launch confirmed in india

ఇప్పటికే ఈ రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌ లో RMX5030 మోడల్‌తో కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 లేదా మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ చిప్‌సెట్‌తోపాటు అదనపు టాస్క్‌ ల కోసం Mali G615 MC6 GPU చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. గతంలో వచ్చిన కొన్ని లీక్స్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 OS తోపాటు గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అయితే రియల్‌మి విడుదల చేసిన అల్ట్రా మోడల్‌ ఫోటో ద్వారా కొన్ని డిజైన్‌ వివరాలు వెల్లడయ్యాయి. కెమెరా మాడ్యూ్ల్ డిజైన్‌ను అంచనా వేయవచ్చు. ఈ కెమెరా యూనిట్‌ రెండు సర్కులర్‌ యూనిట్స్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ గ్లాస్ బ్యాక్‌ ప్యానల్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రియల్‌మి P3 ప్రో 5G, P3x 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రీమియం వేగాన్ లెదర్‌ డిజైన్‌, మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది.

ఈ ఫోన్ 50MP + 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది.

రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ 6.83 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP సోనీ IMX896 కెమెరా, 2MP లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ ప్రో మోడల్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.21999 కే సొంతం చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3 Ultra 5G smartphone launch confirmed in india, handset teased image
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X