Home
Mobile

రూ.13,999కే రియల్‌మీ P3x 5G.. వేడి, నీళ్లకు తట్టుకునే ఈ స్టైలిష్ ఫోన్‌పై రూ.1000 హోలీ డిస్కౌంట్ కూడా..!!

Realme P3x 5G : రియల్‌మీ సంస్థ ఇండియాలో సరికొత్త P3x 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేసింది. P3 ప్రో 5G మోడల్‌తో పాటే దీన్ని రిలీజ్ చేశారు. అదిరిపోయే హోలీ పండుగ ఆఫర్లతో ఈ ఫోన్ ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. IP69 రేటింగ్, 85°C వేడిని తట్టుకునే శక్తి ఈ ఫోన్‌ సొంతం. అందుకే దుమ్ము, నీరు, ఎలాంటి కఠిన పరిస్థితులనైనా P3x 5G ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

"మిగతా ఫోన్లు చెమటలు కక్కుతుంటే.. మేం మాత్రం దుమ్ము దులిపేస్తాం" అని రియల్‌మీ ధీమాగా చెబుతోంది. ఫోన్‌ను ఎలా పడితే అలా వాడేవారు అలాగే, స్టైలిష్‌గా కనిపించే ఫోన్ కావాలనుకునే వారికి ఈ మొబైల్ బాగా సరిపోతుంది, దీని ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే దీన్ని ఇంత మంచి ధరకు తీసుకురావడం ఒక వరం.

Realme P3x 5G

* డిస్కౌంట్లు
రియల్‌మీ P3x 5G (6GB + 128GB) అసలు ధర రూ.16,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌ లో ఇప్పుడు 17% డిస్కౌంట్‌తో కేవలం రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌ లో బ్యాంక్ ఆఫర్లతో రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఫోన్ ధర రూ.12,999 కి పడిపోతుంది. ఫ్లిప్‌కార్ట్‌ లో కూడా బ్యాంకు ఆఫర్లతో రూ.1000 తక్షణ తగ్గింపు పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఏకంగా రూ.1,650 వరకు తగ్గింపు ఉంది. నెలకి జస్ట్ రూ.637 EMIతో ఈ మన్నికైన ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇటీవల రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేస్తే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది.

* పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే
రియల్‌మీ P3x 5Gలో 6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సూర్యరశ్మిలో కూడా క్లియర్‌గా కనిపించే స్క్రీన్, కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐ కంఫర్ట్ మోడ్, పేపర్ లాంటి డిస్‌ప్లే సెట్టింగ్స్ ఇందులో ఉన్నాయి.

మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్, గేమింగ్ అన్నింటిలోనూ దుమ్మురేపుతుంది. రియల్‌మీ P3x 5Gలో 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. IP69 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీరు ఏమీ చేయలేవు.

సాహసోపేతమైన ప్రయాణాలు చేసేవాళ్లకి ఈ ఫోన్ మంచి ఛాయిస్. వెగన్ లెదర్ ఫినిష్‌తో ఫోన్ చూడటానికి ప్రీమియంగా, పట్టుకోవడానికి మృదువుగా ఉంటుంది. అంతేకాదు చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటుంది. చలి, వేడిలో ఇది పాడవుతుందని భయపడాల్సిన అవసరం లేదు.

* కెమెరాలు, సెక్యూరిటీ & కనెక్టివిటీ
రియల్‌మీ P3x 5G వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా (f/1.8 అపర్చర్) ఉంది. ఇది చాలా వివరంగా, క్లారిటీగా ఫొటోలు తీస్తుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో సపోర్ట్‌తో సెక్యూరిటీకి, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేదు.

కనెక్షన్ విషయానికి వస్తే, ఇందులో 5G కనెక్టివిటీ, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మంచి ఫీచర్లు, స్టైలిష్ లుక్, మన్నికైన క్వాలిటీ.. అన్నీ కావాలంటే రియల్‌మీ P3x 5Gకు మించిన ఫోన్ మరొకటి లేదు.

* లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, యాక్సెసరీలు..
రియల్‌మీ P3x 5G కొన్న మొద‌టి కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఫోన్ కొని రేటింగ్, అఫీషియల్ వెబ్‌సైట్‌లో రివ్యూ రాస్తే 5,000 కాయిన్స్ అకౌంట్‌లో వేస్తారు. మొబైల్‌క్విక్ యూజర్లకు రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు లక్కీ డ్రా తీసి గెలిచిన వాళ్లకి బంపర్ ప్రైజ్‌లు ఇస్తారు. హోలీ ఆఫర్లు ముగిసేలోపు వెంటనే కొనేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3x 5G Laughs at Heat and Water, Grab It for Just Rs 13,999 + Holi Discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X