రూ.9999 ధరకు 6300mAh, HD+ డిస్‌ప్లే, ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్ తో స్మార్ట్‌ఫోన్ విడుదల..!
రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్‌లో గత నెలలో రియల్‌మి 16 ప్రో సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 16 ప్రో, ప్రో ప్లస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ ఫోన్లు ఏకంగా 200MP కెమెరాలను కలిగి ఉంది. ప్రత్యేక డిజైన్‌తో లాంచ్ అయ్యాయి. అనంతరం జనవరి చివరిలో ఏకంగా 10,001mAh బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ మూడు ఫోన్ కూడా మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
అయితే తాజాగా ఎంట్రీ లెవల్ ధరలో రియల్‌మి మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మి P4 సిరీస్‌లో ఇప్పటికే అనేక మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇదే సిరీస్ నుంచి 4G వేరియంట్‌ను లాంచ్ చేసింది. రియల్‌మి P4 లైట్ 4G పేరుతో ఈ ఫోన్ (Realme P4 Lite 4G Smartphone) అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి P4 లైట్ 4G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్, మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. దీంతో 1.8 మీటర్ల ఎత్తువ నుంచి కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువని సంస్థ చెబుతోంది. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
HD+ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 563 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పల్స్ లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. మొత్తంగా తొమ్మిది రంగులు, 5 కస్టమైజబుల్ గ్లోయింగ్ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది.

ప్రాసెసర్ వివరాలు :
రియల్‌మి ఫోన్ ఆక్టా కోర్ UNISOC T7250 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Mail G57 MP1 GPU ను కలిగి ఉంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
6300mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 13MP కెమెరాతోపాటు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. 30fps తో 1080p వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
కనెక్టివిటీ పరంగా 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.2, GPS, GLONASS, BeiDou, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ సెన్సర్, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్ సెన్సర్‌లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
రియల్‌మి P4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999 గా ఉంది. ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఫోన్‌ను రియల్‌మి ఆన్‌లైట్ స్టోర్, ఫ్లి్‌ప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ సీ బ్లూ, ఒబ్సిడియన్ బ్లాక్, బీచ్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








