రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు లీక్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి భారత్ మార్కెట్ లో త్వరలో P4x 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయనుంది. ఈ సంవత్సరం P సిరీస్ నుంచి P3, P4 మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఇటీవలే P3 సిరీస్‌లో లైట్ వేరియంట్స్, P4 సిరీస్ బేస్, ప్రో మోడల్స్‌ను విడుదల చేసింది. త్వరలో P4x మోడల్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టీజర్‌ను షేర్ చేసింది.
తాజాగా రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ (Realme P4x 5G Smartphone) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఆ ఫోన్ కు సంబంధించిన ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ లైవ్‌లో ఉంది.

అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లను టిప్‌స్టర్ సుధన్షు అంబోర్ లీక్ చేశారు. ఈ వివరాల ఆధారంగా ఈ ఫోన్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
భారీ బ్యాటరీ! :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 90fps గేమ్‌ప్లే్ను సపోర్టు చేస్తుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది.
50MP కెమెరా! :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉంటాయని భావిస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా! :
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లోనే కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదేనని రియల్‌మి చెబుతోంది. దీంతోపాటు సౌకర్యంగా ఒకేసారి 18 యాప్స్‌ను వినియోగించుకొనే సామర్థ్యం ఈ ఫోన్ కలిగి ఉంటుందని చెబుతోంది.
ఎంత ధరలో విడుదల కానుందంటే :
ఈ హ్యాండ్‌సెట్ OS సహా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వివరాలు తెలియాల్సి ఉంది. మరియు ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. అయితే ఈ ఫోన్ రూ.20,000 కంటే తక్కువ ధరలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* ఇటీవలే విడుదలైన ఫ్లాగ్‌షిప్ మోడల్ :
భారత్ మార్కెట్‌లో రియల్‌మి సంస్థ ఇటీవలే రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల QHD+ BOE Q10 ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పనిచేస్తోంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్ కెమెరా, 120x డిజిటల్ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరా ఉంది.


Click it and Unblock the Notifications






