మొదలైన రియల్‌మి X2 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్
రియల్‌మి తన ఫ్లాగ్‌షిప్ X2 ప్రోతో పాటు రియల్‌మి 5 ఎస్, రియల్‌మి యూత్ బడ్స్ వైర్‌లెస్‌ను నవంబర్ 20 న ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. గత వారం రియల్‌మి ఎక్స్ 2 ప్రోను ముందుగా కొనుగోలు చేసే వారి కోసం కంపెనీ 'బ్లైండ్ ఆర్డర్' సేల్స్ ని టీజ్ చేసింది. ఈ ప్రత్యేకమైన సేల్ ఈ రోజు అంటే నవంబర్ 18 న జరుగుతోంది. ఇది అధికారిక ఆవిష్కరణకు ముందు రియల్‌మి X2 ప్రో ను ప్రీ-బుకింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులందరి కోసం.

రియల్‌మి సంస్థ అందించిన సమాచారం ప్రకారం రియల్‌మి ఎక్స్ 2 ప్రో బ్లైండ్ ఆర్డర్ సేల్ ఈ రోజు అంటే నవంబర్ 18న రియల్‌మి.కామ్‌లో ప్రారంభం కానున్నది. ఇందుకోసం వినియోగదారులు బుకింగ్ సమయంలో రూ.1000లు చెల్లించవలసి ఉంటుంది. దీని తరువాత నవంబర్ 20 మరియు నవంబర్ 21 మధ్య మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించి రియల్‌మి X2 ప్రో స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు.

వారు పూర్తి చెల్లింపు చేసిన తర్వాత కంపెనీ స్మార్ట్ఫోన్‌ను కస్టమర్ ఇచ్చిన చిరునామాకు పంపుతుంది. నిబంధనలు మరియు షరతులలో గుర్తించినట్లుగా మొదటి 855 మంది వినియోగదారులు మాత్రమే ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందుతారు. ఇక్కడ గమనించదగ్గ మరొక విషయం ఏమిటంటే రియల్‌మి ఎక్స్ 2 ప్రో లాంచ్ ఈవెంట్ నవంబర్ 20 న మధ్యాహ్నం 12:30 గంటలకు న్యూ డిల్లీలో జరగనున్నది. రియల్‌మి 5 ఎస్ మరియు రియల్‌మి యూత్ బస్ వైర్‌లెస్ కూడా ఈ కార్యక్రమంలో కంపెనీ విడుదల చేయనున్నది.

రియల్‌మి X2 ప్రో ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. అక్కడ ఇది మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేక ఎడిషన్ కూడా ఉండవచ్చు అన్న అంచనా కూడా ఉంది. 6 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ చైనాలో ధర RMB 2,599 (సుమారు రూ .26,000). ఇండియాలో కూడా ఈ వేరియంట్‌కు ఇదే ప్రారంభ ధరను కలిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

స్పెసిఫికేషన్స్
రియల్‌మి ఎక్స్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ ద్వారా రన్ అవుతుంది. ఆసుస్ ROG ఫోన్ 2, షియోమి బ్లాక్‌షార్క్ 2 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మాత్రమే ముందుగా ఈ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతున్న డివైస్లు. ఈ డివైస్ యొక్క రూపకల్పన చైనాలో ప్రారంభించటానికి ముందే కంపెనీ ధృవీకరించింది. ఈ డిజైన్ రియల్‌మి ఎక్స్ 2 తో అధికారికంగా మార్కెట్ లోకి రానున్నది. రియల్‌మి X2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 2400 x 1080 పిక్సెల్‌ల పూర్తి HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంది.

ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రోలో చూసినట్లుగా ఉంటుంది. డిస్ప్లే 135HZ టచ్ శాంప్లింగ్ రేటు వరకు సామర్థ్యం కలిగి ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. రియల్‌మి ఎక్స్ 2 ప్రో మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది అందులో 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 12 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది మరియు ఇది 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

ఇందులో గల ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో డాల్బీ అట్మోస్ మరియు డ్యూయల్-బ్యాండ్ వైఫైతో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది కలర్‌ఓఎస్ 6.1 తో రన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








