10వేల లోపు ధరలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియాలో ఇప్పుడున్న సమయంలో స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువ మంది వాడుతున్నారు. చాలా రకాల కంపెనీలు అనేక బడ్జెక్ట్ విభాగాలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు ధనవంతుల కోసం అధిక ధర గల ఫోన్‌లను విడుదల చేస్తే వీటితో పాటుగా తయారీదారులు బడ్జెక్ట్ రేంజ్ ఫోన్‌లను కూడా విడుదల చేసారు. దీపావళి,దసరా సందర్బంగా స్మార్ట్‌ఫోన్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను ఆన్ లైన్ ద్వారా డిస్కౌంట్ ధరలకు అందించారు. కానీ ఇప్పుడు ఫెస్టివల్ సేల్స్ ముగిసిన కూడా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను 10వేల లోపు అందిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 రెడ్‌మి నోట్ 8
 

రెడ్‌మి నోట్ 8

10వేల లోపు బడ్జెక్ట్ రేంజ్ ఫోన్‌ల లోపు విషయానికి వస్తే అందులో ముందు వరుసలో ఉండేది రెడ్‌మి నోట్ 8. ఇది రూ .9,999ల వద్ద లభిస్తుంది. ఇండియాలో తక్కువ బడ్జెక్ట్ లో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో నిస్సందేహంగా రెడ్‌మి నోట్ 8 ఒకటి. ఇది 6.39-అంగుళాల ఫుల్ HD + (1080 X 2340) డిస్ప్లేను కలిగి ఉంటుంది. పనితీరు విషయానికి వస్తే ఇందులో 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ మెమరీతో కూడి ఉన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC ఆధారంగా పనిచేస్తుంది. ఇది నాలుగు కెమెరాల క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది ఇందులో 48MP + 8MP + 2MP + 2MP సెన్సార్లను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఇది 28W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000 mAh బ్యాటరీ కూడా ఉంది.

గిన్నిస్ రికార్డు సృష్టించిన OV6948 చిన్నకెమెరా సెన్సార్‌

 రియల్‌మి 5

రియల్‌మి 5

తదుపరి వరుసలో రియల్‌మి 5 ఉంటుంది. దీని ధర రూ.9,990లుగా ఉంటుంది. ఇది అందిస్తున్న స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ 6.5-అంగుళాల HD + (720 x 1600) LCD ప్యానెల్ టియర్‌డ్రాప్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. పనితీరు యూనిట్‌లో భాగంగా ఇది స్నాప్‌డ్రాగన్ 665 SoC ఆక్టా-కోర్ SoC ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ మెమరీ జత చేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇందులో 12MP + 8MP + 2MP + 2MP సెటప్‌తో గల క్వాడ్ కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి. అలాగే ముందువైపు సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇందులో 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో గల 5,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో!!! ఆకాశాన్ని అంటే ధర!!!

Vivo U10
 

Vivo U10

రెడ్‌మి మరియు రియల్‌మి ఫోన్‌లు ఎక్కువ ధర అని భావించే వారు ఈ బ్రాండ్ ఫోన్‌లను ఎంచుకోవచ్చు. ఇది రూ.8,990 నుండి వినియోగదారులకు లభిస్తుంది. ఇది అందిస్తున్న స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో 6.35-inch ఫుల్ వ్యూ హెచ్‌డి + (720 x 1544) ఐపిఎస్ డిస్‌ప్లే వాటర్-డ్రాప్ నాచ్ ఫీచర్ తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇందులో 13MP + 8MP + 2MP సెన్సార్లతో గల ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ ఉంటుంది. పనితీరు విభాగంలో 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ మెమరీతో జత చేయబడి ఉన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతు గల 5,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

నవంబర్ 5న రిలీజ్ అవుతున్న షియోమి 108-MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ Mi CC9 ప్రో

రియల్‌మి 3 ప్రో

రియల్‌మి 3 ప్రో

రియల్‌మి 3 ప్రో వినియోగదారులకు రూ.9,999ల ధర వద్ద లభిస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.3-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే (1080 x 2340p) కలిగి ఉంటుంది. పనితీరు భాగంలో ఇది 2.2 GHz క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 AIE ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విభాగంలో వెనుక వైపు 16MP (f / 1.7) + 5MP (f / 2.4) సెన్సార్ గల డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీల కోసం ముందువైపు 25MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 20W VOOC 3.0 ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో కూడిన 4,045 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

మోటరోలా వన్ మాక్రో

మోటరోలా వన్ మాక్రో

బడ్జెక్ట్ ధరల విభాగంలో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్న వాటిలో మోటరోలా కంపెనీ ఫోన్‌లు కూడా ఉన్నాయి. మోటరోలా వన్ మాక్రో ఫోన్ యొక్క ధర రూ.9,999. ఇది అందిస్తున్న స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో 6.2-అంగుళాల HD + మాక్స్ విజన్ డిస్ప్లే (720 x 1520 పిక్సెల్స్) ఉంటుంది.డిస్ప్లే లోపల 8MP ఫ్రంట్ కెమెరా కోసం ఒక చిన్న డ్రాప్ కూడా ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇందులో 13MP + 2MP + 2MP సెన్సార్లతో గల ట్రిపుల్-లెన్స్ కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉంది. ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ మెమరీతో జతచేయబడి వున్న మీడియాటెక్ హెలియో P 70Soc ఆధారంగా పని చేస్తుంది. మోటరోలా వన్ మాక్రో ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు గల 4,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

ఆపిల్ ఐఫోన్ వారంటీ గురించి మీకు తెలియని విషయాలు

రెడ్‌మి 8

రెడ్‌మి 8

10వేల లోపు బడ్జెక్ట్ ఫోన్ లలో తక్కువ ధర వద్ద లభిస్తున్న వాటిలో రెడ్‌మి 8 ముందు వరుసలో ఉంటుంది. ఇది రూ.7,999 ధర వద్ద లభిస్తుంది. రెడ్‌మి 8 అందిస్తున్న డిజైన్ విషయానికి వస్తే ఇది 6.22-అంగుళాల HD + డిస్ప్లే (720 x 1520 పిక్సెల్స్) కలిగి ఉంది. రెడ్‌మి 8 పనితీరు విషయంలో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ను కలిగి ఉండి ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC ఆధారంగా పనిచేస్తుంది. యుఎస్‌బి టైప్-సి ఆధారిత 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుగా 5,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇందులో వెనుక వైపు 12MP + 2MP లెన్స్‌లతో గల డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ M30

శామ్సంగ్ గెలాక్సీ M30

ఇండియాలో ముందు నుంచి నోకియా తరువాత బాగా పాపులర్ అయిన స్మార్ట్‌ఫోన్‌ ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట శామ్సంగ్ ఫోన్. అలాంటిది శామ్సంగ్ గెలాక్సీ M30 ఇప్పుడు రూ.9,999 ధర వద్ద లభిస్తున్నది. గెలాక్సీ ఎం 30లో ఉన్న స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే ఉంది. ఆప్టిక్స్ విషయంలో 13MP + 5MP + 5MP సెన్సార్లతో గల ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. అలాగే సెల్ఫీస్ కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. పనితీరు యూనిట్‌లో ఇది ఎక్సినోస్ 7904 ప్రాసెసర్ ఆధారంగా పని చేయడానికి 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ మెమరీతో జత చేయబడి ఉంటుంది. గెలాక్సీ M30 లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో గల 5,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best 7 Budget Smartphones Under Rs.10,000 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X